ఆంధ్రలపౌరుషము!ఆంధ్రులయౌన్నత్యము!!ఆంధ్రుల బుద్ధివైభవము!!!
ఆంధ్రుల చరిత్రము.
---<>---
పౌరుషమునందును, పాండిత్యాతి శయంబునందును, రాజ్యవిస్తారంబునందును, పూర్వపు ఆంధ్రులు హిందూదేశములోని యితర దేశములవారికి దీసిపోవువారు కారని యీగ్రంధము సప్రమాణముగా సిద్ధాంతీకరించుచున్నది!. ఇప్పటి యాంధ్రులవలెనే మనపూర్వపు టాంధ్రులు గూడ కూపమండూకములు అని యనుకొంటిరా? ఆంధ్రులొకప్పుడు మగధ సామ్రాజ్యమును, ఇంకొకప్పడు మహారాష్ట్రమును, మరియొకప్పుడు యవద్వీపమును, వేరొకప్పుడు పాండ్యచోళ దేశంబులునుజయించిరని మీరు కలనయిన నెరుగుదురా? ఎరుంగనియెడల ఈ గ్రంథము జదువుడు.
400 పుటలు కలిగియుండును. క్యాలికోబైండు చేయబడినది. కొద్దిరోజులలో చందాదారులకీయబడును.
ఇది స్వతంత్ర చరిత్రగ్రంధము (Original History) విఖ్యాతాంధ్రలేఖకులయిన మ-రా-రా-శ్రీ, చిలుకూరి వీరభద్రరావుగారిచే వ్రాయబడినది.
వెల మా చందాదారులకు పోస్టేజి సహా ... 1-0-0
ఇతరులకు పోస్టేజీగాక ........... 1-4-0