పుట:Andhrula Charitramu Part-1.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ మదాంద్ర వాల్మీకి రామాయణము.

శ్రీకుమారాభ్యుదయ, శ్రీకౌసల్యాపరిణయాది గ్రంథకర్తలగు బ్రహ్మశ్రీ వావిలికొలను సుబ్బారావుగారిచే రచితము. సంస్కృత వాల్మీకి రామాయణమునందలి రసముగాని భావముగాని తత్వార్థముగాని మంచి..ములగాని మంత్రార్థములగాని విడువక గాయత్రీ బీజాక్షరసంయుతంబై మూలముననున్న యన్ని విశేషంబులతోడ వాల్మీకిమహర్షి మార్గమనవలంబించి యుత్తరకాండంబుతోడ నేడుకాండంబులు నిర్వచనంబుగ స్త్రీలు పిల్లలుకుగూడ సులభముగ నర్థమగునట్లు తెలిగింపబడినది. గ్రంథమునందు పై విశేషములన్నియు దెలియునట్లుకవిగారే చక్కని పీఠికయువ్రాసియున్నారు. ఇదివరకుండు తెనుగు రామాయాణములన్నిటికంటె నిది మూలమునకు సరిగాను, లలితముగను, రసవంతముగను సరళముగను సుఖబోధకముగా నున్నదని యనేక పండితులభినందించియున్నారు.

ఏడుకాండములు;- రెండు సంపుటములుగ నిండుకాలికోవస్త్రముతో నట్టకట్టింపబడినవి. మంచికాగిదములపై బెద్దయక్షరములతో ముద్రింపబడి సర్వజనులకు సులభముగలభ్యపడ దగులుబడి మొత్తమునకే విక్రయింపబడును. రెండుసంపుటములవెల. రు.4.8.0 (తపాలకూలిగాక)

క్రొత్తపల్లి వేంకటపద్మనాభశాస్త్రి,

96. వీరరాఘవమొదలివీధి తిరువళిక్కేణి, చెన్నపురి.

మనోరమ.

ఇది ప్రత్యాంగ్లేయమాసమున చిలకమర్తి లక్ష్మీనరసింహముగారిచే ప్రకటింపబడును. ఇందురసవంతములగు నాటకములు, మహాపురుషుల జీవితములు, మనోహరములగు నవలలు సంఘసంస్కరణ విషయవ్యాసములు దేశచరిత్రలు, వినోదములు, మొదలగునవి చక్కని వచనశైలిలో వ్రాయబడును. చందా. సం|| రమునకు రు 3-0-0 లు మాత్రమే.

"మేనేజరు, మనోరమ, రాజమండ్రి" అని చిరునామా వ్రాయవలెను.

ఆంధ్రకేసరి.

ఇది ప్రగమన శీలయగు యొక వారపత్రిక.

ఇందలివ్యాసములలోకోపయోగశీలతయు, భాషారమ్యతమయు ప్రశంసనీయములు. చందా. సం|| రమునకు రు.3-0,0

మేనేజరు, ఆంధ్రకేసరి, రాజమండ్రి.

- - - -

EDWARD PRESS, MADRAS