Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్రప్రత్రిక.
---
మంచి కాగితము!
పెద్దయాకృతి!!
చక్కని అచ్చు!!!
బహుచవుక!!!!

ఈ పత్రిక బొంబాయి నుండి వెలువడుచున్నది. సకలదేశ సమాచారములతోను, చిత్రపటములతో గూడిన దేశభక్తుల చరిత్రలతోను నిండి చదువుటకు మహాయోగ్యముగా నుండును. ఈ పత్రిక నన్ని యాంధ్రపత్రికలకంటె చవుకయయి, నన్నిటికంటెను పత్రబాహుళ్యమునందేగాక విషయ బాహుళ్యము నందును సాటిలేనిదై, ఒకసారి చదివిన వారి నెల్లప్పుడు నాకర్షించుచు ప్రతివారము తప్పక వెలువడుచు పెక్కండ్రు మహాపురుషుల మన్ననలను బొందుచున్నది. ప్రతి యాంధ్రుడునాంధ్రపత్రికను తప్పక చదివి తీరవలయును.

చందాసం:1-కి రూ|2-2-0లు మాత్రమే.
చిరునామ:____ మేనేజరు, ఆంధ్రపత్రిక,

ఫోర్టు, బొంబాయి