ఈ పుట ఆమోదించబడ్డది
ఈ గ్రంథములు సంస్కృతభాష తెలియని వారికుపయుక్తముగ కనిగిరి కోర్టుప్లీడరు కొమాండూరు నృసింహచార్యులవారిచే రచింపబడినది. గురువులేక విద్యనేర్చు కొనతగినంత సులభ శైలినినున్నవి. ఇప్పటికి సుమారు 25సంవత్సరములనుంచి అతి ప్రఖ్యాతిగాంచిన గ్రంథములు. శ్రీపతియందు ఒక జాతకము, ఉదాహరణముగా వ్రాసిచూపబడియున్నది.
అహోబిలనాధీయమందు ఒక సంవత్సరమునుంచి సరియైన గణితము చూపబడియున్నది. భూఖగోళ విషయములు సంగ్రహముగా వ్రాసి అంతమున చేర్పబడియున్నవి. ఏ గ్రంథమైనను క్రయం రు. 1-8-0 పోస్టు కర్చులు కొనువారె భరింపవలెను. ఒకతూరి 8 గ్రంథములు కొనువారికొకగ్రంథము ఉచితముగా నీయబడును.
అన్నియు అయిపోయి కొన్నియేయున్నవి. త్వరపడుడు!
బుధజనవిధేయులు.
కొ. పార్థసారధి అయ్యంగార్.
- స్టోన్ హవుసుపేట నెల్లూరు.
- స్టోన్ హవుసుపేట నెల్లూరు.
ఈ గ్రంథములవిషయసూచిక కోరువారు 0-0-6 బిళ్లపంపిన తెలియపరచెదము.