Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ వాల్మీకి రామాయణ ప్రకటనము.

శ్రీ వాల్మీకి రామాయణములోని ఆరుకాండలను ఆంధ్రతాత్పర్యవిశేషార్థములతోడ తేట తెనుగులో వ్రాసి ముద్రించియున్నాము. ఎడమవయిపు పుటలలో శ్లోకములు కుడివయిపు పుటలలో శ్లోకముల నంబరు ప్రకారము తెనుగు అర్థము వ్రాయబడియున్నది. కనుక పారాయణము చేసికొనుటకు, లేదా కథనుమాత్రము చదువుకొనుటకు మిగుల అనుకూలముగ నుండును.

బాలకాండ. రు అ పై 1 3 0
అయోధ్యకాండ --- 2 5 0
అరణ్య కాండ --- 1 3 0
కిష్కింధ కాండ --- 1 3 0
సుందరకాండ --- 1 3 0
యుద్ధకాండ --- 2 5 0
వాల్మీకి రత్నములు --- 1 7 0.
ఆంధ్రమహాభారతరత్నములు --- 1 7 0
సంస్కృత మహాభారతము
విరాటపర్వము:- ఆంధ్రతాత్పర్యసహితము 2 4 0
సభా పర్వము:- ఆంధ్రతాత్పర్యసహితము 2 8 0

శశిలేఖ. ఇది 16 సంవత్సరములనుంచి అవిచ్ఛిన్నముగా వారమునకు రెండుసారులు ప్రచురింపబడుచున్న వార్తాపత్రిక. ఇందుదేశదేశముల సమాచారములు ఇంగ్లీషులోని మహోపన్యాసముల భాషంతరీ కరణములు సాంఘీక, పరిశ్రామిక, రాజకీయ, భాషావిషయక అంశములనుగురించి నస్వతంత్ర వ్యాసములు కలిగియుండును. చందా సం|| ముకు 6-0-0 మాత్రమే. తగిన ప్రోత్సాహము దొరకెనేని దినపత్రిక చేయదలచుచున్నాము.

పై ధరలలో వి.పి.పోస్టుకర్చులు చేరియున్నవి.

విక్రయ ప్రదేశము.

గటుపల్లి శేషాచార్యులు, శశిలేఖా ఆఫీసు, జార్జి టవున్, చెన్నపురి.