- - -
అనేక దేశములనుంచి యేరి తెప్పించిన నూటికెక్కువ సుప్రసిద్ధజాతుల అంటుమామిళ్లు, సపోటా, లిచ్చి, నాగపూరు, సంతరా, కమలా, కొడగు నారంగి, మోసంబి, బతాయి, పంపరపనసల అంట్లు, కాబూలిదాళిమ, ద్రాక్ష, స్ట్రాబరి, రాసుబరి, ఆపుల్, పీచి, మంగోస్టి్ మొదలయిన వివిధ ఫల వృక్షముల పిల్లలు, చిత్రవిచిత్రమయిన రంగులుగల క్రోటన్ మొదలయిన ఆకు పసందు చెట్లు లెక్కలేని జాతులపూలచెట్లు ఈ దేశమునకు తగిన నూరుజాతుల గులాబిచెట్లు, వర్నశాలలవంటి చలవ ప్రదేశములలోవుంచే అనేక జాతులచెట్లు, సమస్తజాతుల యింగ్లీషు పూలవిత్తనాలు, కాబెజి, కాలిప్లవరు నూలుకాలు మొదలయినవిదేశపుకూరకాయవిత్తనాలు, చౌకధరలకు వీలయినంతవరకు తోటలకృషి వ్యాపింపచేయునభిప్రాయముతో విక్రయింపబడును.
వలయువారు కేటలాగులు తెప్పించుకోవచ్చును. ఉరుదు ఇంగ్లీషు తెలుగు మహారాష్ట్ర భాషలలో కేటలాగులు దొరకును.
వలయువారు ఈక్రింది అడ్రసుకు వ్రాయవలెను.
|
D.L.NARAYANA ROW,
PROPRIETOR Nursery Gardens, HYDERABAD,(Deccan,) |