పుట:Andhrula Charitramu Part-1.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సుందరుల మందారము. హిందూసుందరి. రమణుల యాభరణము.

---

ఇది ప్రత్యేకము స్త్రీలకొఱకు ప్రచురింపబడుమాసపత్రిక. విదుషీమణియగు శ్రీమతి మొసలిగంటి రామాబాయమ్మ గారు దీనికి సంపాదకురాలు. ఇందు పాతివ్రత్యము, దైవభక్తి, గృహిణీధర్మములు, శిశుపోషణము, గృహనిర్వాహకవిధులు మొదలయిన స్త్రీలకత్యంతోపయుక్తములగు విషయములు పండితులగు నారీమణులచో వ్రాయబడుచుండును. పురాణకధలు, నవీనచరిత్రలు, ప్రహసనములు, పద్యములు, ఉపన్యాసములు, సాధ్వీమణుల జీవితములు ఇందువిశేషముగ నుండును. కుట్టుపనులు నేర్చుకొను విధము, పూలచెట్లబెంచురీతి, ఉపాధ్యాయుడక్కరలేకుండ ‌విషయము బోధపడునంతసరసముగా బొమ్మలతో వ్రాయబడును. మంగళహారతులు, కీర్తనలు, పాటలు, మొదలగునవి యుండును. ఈ ‌విషయమావిషయమననేల అతివలకత్యంతావశ్యకములగు పలువిషయములిందుండును. చదువనేర్చిన ప్రతి స్త్రీయొక్క చేతనుండదగినది.

ఈ కార్యాలయమునందు స్త్రీలవశ్యముగా పఠించవలసిన వనేక గ్రంథములు సరసమైన వెలకు దొఱకును.

వలయువారు. సత్తిరాజు శీతారామయ్యగారు,

మేనేజరు, హిందూసుందరి.
కంతేరు పోస్టు, కృష్ణా జిల్లా

అనివ్రాయవలెను.