ఈ పుట ఆమోదించబడ్డది
6
ఆంధ్రదేశ కథాసంగ్రహము.
నిరంతరము వర్ధిల్లుతుండెడి జనపరంపర చేతను, దివ్యక్షేత్ర మాహాత్మ్యముల బోధించెడి స్థలపురాణాద్యుద్గ్రంథసముదాయము చేతను, అలంకరించబడి దేవతల యుద్యానవనమో, పాలకుల ముంగొంగుబంగారమో, గృహస్థుల భూతల స్వర్గమో యన నాగరికతాభివృద్ధులఁ బెల్లుగ నతిశయించుతు నాంధ్రనామముచే వ్యవహరింపఁ బడుచున్నదో అట్టి యీ దేశము మూడువేలేండ్లకు పూర్వమొకప్పుడు ఘోరకిరాతావృత దండకారణ్య మధ్యగతమైన చీమలేని చిట్టడవిగనూ కాకిలేని కాఱడివిగను నుండినట్లు మనపూర్వగ్రంథములు చాటుచున్నవి.