పుట:Andhrula Charitramu Part-1.pdf/419

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


క్రొత్త నవల! అత్యద్భుతమైననవల!! రంగుపటములుకలది!!
విమలాదేవి.
---

ఇది రాజపుత్రస్థాన చరిత్రవిషయక నవల. అవరంగజేబునకు బ్రతిస్పర్ధియైన రాజసింహుని యొక్కయు, అతని భార్యయగు విమలాదేవి యొక్కయు శౌర్యము, ధైర్యము, మతాభిమానము మొదలయిన విందు జక్కగ బ్రదర్శింపబడినవి. అవరంగజేబు యొక్క యంతఃపురములోని చిత్ర విచిత్రములయిన వ్యవహారములును, అతని పట్టమహిషియగు ఉదయపురికిని, చెల్లెలగు రోష్నారు కునుగల మచ్చరమును, కాబూలు దేశమునకు భర్త వెంటపోయిన చంద్రావతి దేవియొక్క పవిత్ర చరిత్రమును ఇందిరాదుర్గాదాసుల రాజభక్తియు, దేశరక్తియు, ధర్మాసక్తియు గోలకొండ లోని యక్కన్న మాదన్న గారి వైభవమును, అబూపర్వతముమీది యచలేశ్వర మందిరములోనున్న వైకుంఠయోగి చేసిన యద్భుతకృత్యములనున మిక్కిలి రమ్యముగ వర్ణింపబడినవి. కథాసందర్భము (Plot)అత్యద్భుతము, ఖయిబర్ కనుమ, ఆరావలీ పర్వతారణ్యశోభ మొదలయిన వర్ణనలు అశ్రుతపూర్వములు. పుటలు 300 కంటె నెక్కుడు. వర్ణనలను అనుసరించిన హాఫ్ టోన్ పటములు. ఇందుగొన్ని పెక్కురంగులతో నిజమైన మనుష్యులవలెనే యుండునట్టి పటములుండును. ఇట్టి సర్వాంగసుందరమైన నవల యిదివరకు తెలుగులో బ్రకటింపబడలేదని చెప్పవచ్చును. అచ్చులోనున్నది.

ఇది బాలకవి భోగరాజు నారాయణమూర్తిగారిచే రచింపబడినది.