పుట:Andhrula Charitramu Part-1.pdf/418

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్రులపౌరుషము! ఆంధ్రులయౌన్నత్యము!! ఆంధ్రులబుద్ధివైభవము!!!
400పుటలు. ఆంధ్రుల చరిత్రము. క్యాలికోబైండు

- - -

ఐతరేయ బ్రాహ్మణ కాలమునుండి నేటివఱకు అయిపోయినయాంధ్రులను గుఱించిన చరిత్ర ఈ గ్రంథమందు సవిస్తరముగ నుండును. ఇది స్వతంత్రచరిత్రగ్రంథము (Original History) ‌విఖ్యాతాంధ్రలేఖకులయిన మ.రా.రా. చిలుకూరి వీరభధ్రారావుగారిచే రచింపబడినది.

వెల మా చందాదారులకు పోస్టేజి సహా .. 1 0 0

ఇతరులకు పోస్టేజీ గాక ....1 4 0కం.వీరేశలింగము గారి

స్వీయచరిత్ర

- - -

ఇంగ్లీషు భాషలో మహనీయుల స్వీయచరిత్రలు పెక్కులున్నను తెలుగులో నేటివరకు నొక్కటియు లేకపోవుట గొప్ప లోపమనియు, దానినెట్లు తొలగింపనగుననియి మేము చింతించుచుండగా రావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమ స్వీయచరిత్రమును ప్రకటించు గౌరవము మాకు గలుగుజేసిరి. గద్యతిక్కనయైన ఈ మహనీయుని గురించి గాని వారిగ్రంథమలను గురించిగాని మేమధికముగా యుట కాగడాతో సూర్యుని జూపించుటయే!

గర్వముగాని, స్వాతిశయభావముగాని యెంతమాత్రమును లేక, యున్నది యున్నట్లుయథార్థచరితము ఇందుజక్కనిభాషతో వ్రాయబడినది. ఈ చరిత్రముజూచి పంతులవారి విరోధులుగూడ తలయూపెదరని మానమ్మిక. త్వరలోనే వెలువడును