పుట:Andhrula Charitramu Part-1.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞానచంద్రికా గ్రంథమాల.

1.దేశాభివృద్ధికి ఆవశ్యకములైన గ్రంథములు ప్రచురించి భాషాభివృద్ధిచేయుటయే యీ గ్రంథమాలయొక్క యుద్దేశము. ఇందు సంవత్సరమునకు రమారమి 1200 పుటలుగల స్వతంత్రమైన గ్రంథములు నాలుగు ప్రచురింపబడును.

2.కొందరు తలచునట్టు ఇది మాసపత్రికకాదు. ఇందు 1. దేశదేశముల చరిత్రములను, 2 పదార్థవిజ్ఞానశాస్త్రము(Physics), రసాయనశాస్త్రము మొదలైన ప్రకృతిశాస్త్రములును, 3. దేశోపకారులగు కొందరు మహనీయుల చరిత్రములును. 4. ఇంగ్లీషునందలి ఉద్గ్రంథముల భాషాంతరీకరణములును మాత్రము ప్రచురింపబడును. కావ్యనాటకాదులిందుండవు. చరిత్రానుసారములగు కల్పితకథలుగాడ ప్రచురింపబడును.

3.ఈ గ్రంథమాలలో నిదివరకు అచ్చువేయబడిన గ్రంథములనన్నిటినికొనుచు, ఇకముందు ప్రచురింపబడు గ్రంథములనన్నిటిని గొనుటకు వొప్పుకొనువారు శాశ్వతపుచందాదారులు.

4.శాశ్వతపు చందాదారులకు ఈగ్రంథమాలలోని గ్రంథములన్నియునంచెకూలి మేమే భరించి నూరుపుటలకు రు 0-4-0 చొప్పున నిచ్చెదము. ఇతరులకు ఈ పుస్తకములు అంచెకూలిగాక నూరుపుటలకు రు 0-6-0 చొ|| నీయబడును. సం|| చందాదారులకు సం||రమునకు ర్పు 3-0-0 కంటె నెక్కుడు ఖర్చు కానేరదు.

ఒక్కొక్క పుస్తుకమచ్చుపడగానే అది వ్యాల్యూపేయబిల్ ద్వారా పంపబడును.

6.శాశ్వతపు చందాదారులు 0-4-0 ప్రవేశరుసుము క్రింద చెల్లించవలెను. ముందు ప్రచురింపబోవు గ్రంథములు మాత్రము కావలెనని కోరుశాశ్వతపుచందాదారులు 1-0-0ప్రవేశపురుసుము ఇ‌వ్వవలెను.

7.దరఖాస్తులు ఆచంట లక్ష్మీపతి గారికి బి.ఏ ఎంబి., సి.ఎం, మేనేజరు , విజ్ఞానచంద్రిక, చింతాద్రిపేట మదరాసు అని వ్రాసిపంపవలెను.