Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరసింహ గాంగుని వంశము.

గంగవాడిదేశమును బాలించు వీరసింహుని కొడుకు కామార్ణవుడను వాడు గంగవాడి దేశమును తన పినతండ్రికె విడిచిపెట్టి ఏడవశతాబ్ద ప్రారంభమున దనసోదరులతో భూమిని జయించుటకై బయలుదేరి మహేంద్రగిరికి వచ్చి యచ్చటి గోకర్ణస్వామిని గొల్చి వాని యనుగ్రహముచే రాజచిహ్నములనన్నిటినిబడసి పర్వతముదిగి యుధిష్టరునిం బోలె దన నల్వురు తమ్ములతోడను కళింగమును బాలించు బలాదిత్యుని పైదాడి వెడలి వానినోడించి కళింగము నాక్రమించుకొని తనతరువాత పెద్ద తమ్ముడు పట్టాభిషిక్తుడు గావలయునని నిశ్చయించి మూడవతమ్ముడయిన గుణార్ణవునకు అంబవాడివిషయమును నాలుగవవాడయిన మారసింహునకు చోడమండలమును కడపటివాడయిన వజ్రహస్తునకు కంటకవర్తనిదేశము నొసంగి తనమెడలోని హారమును దానార్ణవుని కంఠము నలంకరించెను. ఇందు బేర్కొనబడిన విషయములన్నియు గంజాము మండలములోనివే అంబవల్లి(అంబవాడి) (చోడ) గ్రామము లిప్పటికిని పర్లాకిమిడి జమిందారిలోనున్నవి గనుక అంబవాడి విషయమును, చోడమండలము నచ్చటివేయని చెప్పవచ్చును. కామార్ణవుడు 35 సంవత్సరములు పరిపాలనము చేసినతరువాత దానార్ణవుడు నలువది సంవత్సరములును వాని కొడుకు కామార్ణవుడు 50 సంవత్సరములను వానికొడుకు వజ్రహస్తుడు 15 సంవత్సరములను, వాని సోదరుడు కామార్ణవుడు19 సంవత్సరములను, వానికొడుకు రణార్ణవుడు 5 సంవత్సరములను, వానికొడుకు వజ్రహస్తుడు 15 సంవత్సరములను, వాని సోదరుడు కామార్ణవుడు 19 సంవత్సరములను, వానికొడుకు గుణార్ణవుడు 27సంవత్సరములును, వానికొడుకు బితాంకుశుడు 15 సంవత్సరములను, వానితమ్ముడు కవిగాలాంకుశుడు 12 సంవత్సరములను, వాని తమ్ముడు గుండమరాజు 7 సంవత్సరములను, వాని తమ్ముడు కామార్ణవుడు 25 సంవత్సరములను, వానికొడుకు వజ్రహస్తుడు 35 సంవత్సరములును, వానికొడుకు మధుకామార్ణవుడు తనయన్నలయిన కామార్ణవగుండమరాజులు 5 సంవత్సరములు పాలించిన తరువాత19సంవత్సరములును, వానికొడుకు [1] వజ్రహస్తు

  1. lnd.ant. vol XIII. p 170