పుట:Andhrula Charitramu Part-1.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నలంబరాజవంశము.

ఈనలంబులు త్రినయనపల్లవుని వంశములోని వారమనియు, ఈశ్వరవంశజులమనియు జెప్పుకొని యున్నారని వీరిచరిత్రమును గొంతపల్లవులంగూర్చి వ్రాయబడిన ప్రకరణమున దెలిసియున్నారము. వీరిరాజ్య మనగా నలంబవాడి రాజ్యము బల్లారి, కడప, కందవోలు, మైసూరు మండలములలో జేరియున్నది. వీరికి బల్లారి మండలములోని ఉత్సంగిదుర్గము రాజధానిగనుండెను.ఈ నలంబవాడి రాజ్యము క్రీ.శ. 7వశతాబ్దము మొదలుకొని 10శతాబ్దమువఱకు వర్థిల్లినది గాని యీ రాజులచరిత్రమంతయెక్కువగా దెలియరాదు. వీరు రాష్ట్రకూటులకులోబడిన సామంతులనితోచుచున్నది. ఆంధ్రచోడులకును నలంబులకును, వైదుంబులకును బూర్వము నలంబవాడ, మహారాజవాడి రేనాడు దేశములను బరిపాలించినవారి చరిత్రమును సంగ్రహముగా దెలిసికొనవలసియున్నది. ఈ మూడుభూభాగములిప్పుడు అనంతపురము, కడప,కర్నూలు, బల్లారి జిల్లాలని పిలువంబడుచున్నవి. ఈ మండలములుగల ప్రదేశమంతయును తొమ్మిదవ పదవశతాబ్దములలో నాంధ్రచోడులు, నలంబులు, వైదుంబులు బరిపాలించిరి. వీరికి బూర్వమీ ప్రదేశముల నెవ్వరెవ్వరు పాలించిరో కొంచెముగా దెలిసికొనవలసియున్నది. ఈ దేశమంతయు గ్రీస్తుశకము రెండవశతాబ్దంతమువఱకు నాంధ్రభృత్యుల పరిపాలనమునందుండెను. ఇదంతయు గర్ణాటముగనుండెను. ఈ గర్ణాటమును శాలివాహనవంశజుండును నాంధ్రుడు నగుహారితపుత్రశాతకర్ణి రాజప్రతినిధిగనుండి పరిపాలనముచేసెను. వీని శాసనములు మైసూరురాజ్యములో షిమొగ మండలములోని షికార్పూరు తాలూకాలో స్థానకుందూరుకడనున్నవి. [1]

ఆంధ్రచక్రవర్తియైన గోతమిపుత్రశాతకర్ణికుమారుడయిన పులమాయి యొక్క నాణెములు మైసూరుమండలములోని చిత్రదుర్గముకడగానిపించినవి. ఆంధ్రరాజులయిన శాతకర్ణులచే జయింపబడి పరిపాలింపబడినదగుటచేతనే యీ భాగమున కంతకును గర్ణాటమనుపేరువచ్చినది. ఆంధ్రులకు దరువాత నీ [2]

  1. ఈ చరిత్రములోని 225 దవపొరట చూడుడు.
  2. Mysore,II. 428; Mysore. II.51