పుట:Andhrula Charitramu Part-1.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యనంది విక్రమవర్మ పరిపాలనముయొక్క 17 వ సంవత్సరములో వ్రాయబడిన తిరువళ్లము శాసనములో నుదాహరింపబడిన విక్రమాదిత్యునకంటెభిన్నడనియె భావింపవలయును. [1]

వధూవల్లభ మల్లదేవ నందివిక్రమవర్మముడయనూరు శాసనములో దానాంధ్రమండలములోని 12000 గ్రామముల కధిపతినని చెప్పికొనియున్న విషయము నిదివఱకు తెలిపియుంటిమి. 1906 వ సంవత్సరములో పుంగనూరు జమిందారిలో 8 శాసనము లీబాణమాండలిక రాజులకు సంబంధించినవి ప్రతులెత్తబడినవి. వానిలో నాలుగు(Nos 543, 555, 570,584 of 1906) మహాబలి బాణరాజుకాలములోనివిగ నున్నవి. వీనిలో మొదటిది శూరమతివద్దనుజరిగిన యుద్ధమును బ్రశంసిచుచున్నది. పెర్మనాడి రాజుకొఱకు మహాబలి బాణరాజు వైదుంబరాజగు గండత్రినేత్రునితో గలిసి నలంబరాజును రాచమల్లుని మయిందాడిని నెదుర్కొని ఘోరయుద్ధము చేసెను. కోలారుమండలములోని బంగవాడి శిలాశాసనముగూడ పై యుద్ధమును ప్రశంసించుచున్నది. గాంగపల్లవరాజయిన విజయవిక్రమ నరసింహవర్మ కాలములోని యొకశాసనముగూడ శూరమతి యుద్ధమును గూర్చి ప్రశంశించియున్నది. పైశాసనములలో నుదాహరింపబడిన రాచమల్లుడు గాంగవంశజుడయినయెడల నతడు సత్యకుమారకొంగునివర్మ పెర్మనాడి రాజమల్లుడై యుండవలయును. అతడే యని నిశ్చయమైనయెడల నతడు రాజ్యము చేసిన కడపటికాలము క్రీ.శ.870-1 సంవత్సరమగుచున్నది. [2] [3] కాబట్టి మహాబలిబాణరాజుయొక్క కాలమించు మించుగా దొమ్మిదవశతాబ్ద మధ్యమయి యుండునని చెప్పవచ్చును.

తక్కినశాసనములు నాలుగును మహాహాబలిబాణరాజవిక్రమాదిత్య బాణకందర్పజయమేరుని యొక్కయు(No of 569of 1906) మహాబలిబాణరాజబాణవిధ్యాధరునియొక్కయు, (571 of 1606) మహాబలిబాణరాజవిజయాదిత్యవర

  1. South Indian Inscriptions, Vol III, no 43
  2. Ind Ant Vol XV.p. 175
  3. Ep. lnd. Vol VI p. 59