Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బేటవిజయాదిత్యవంశము.

ఈ వంశమునకు మూలపురుషుడయిన బేటవిజయాదిత్యుడు వేగిదేశమును క్రీ.శ.918 మొదలుకొని 924వఱకును బరిపాలించిన పూర్వచాళుక్యరాజగు అమ్మరాజ విష్ణువర్థనుని జ్యేష్ఠకుమారుడగనుండి తండ్రియనంతరము పట్టాభిషిక్తుడై యుద్ధమల్లునికుమారుడగు మొదటి తాళరాజు చే జయింపబడి పదభ్రష్టుడయ్యెను. వీని కాఱవతరమువాడగు విజయాదిత్యుడు రెండవ కులోత్తుంగుచోడుని కాలములోననగా బండ్రెండవశతాబ్దమున వెలనాటి చోడులకు బిమ్మట వేగి దేశమును స్వాధీనము జేసికొని పరిపాలించినట్లు పిఠాపురములోని మల్లపదేవుని శాసనమువలన దెలియుచున్నది. ఈ శాసనమునందు బేటవిజయాదిత్యుని కాఱవతరమువాడగు మూడవ విజయాదిత్యుని కుమారుడు మల్లవిష్ణువర్థనుడు శాలివాహనశకము1124వ సంవత్సరము జైష్ఠబహుళ 10 భానువారమశ్వినీనక్షత్ర సింహలగ్నమునందు శ్రీపిఠాపురములోని కుంతీమాధవస్వామి దేవాలయములో బట్టాభిషిక్తుడయ్యెనని దెలుపంబడనది. ఈ తెలుగుతిథికి సరియైన యింగ్లీషు తేది (కీల్ హారన్ పండితునిగణన ప్రకారము.) క్రీ.శ. 1202వ సంవత్సరము జూను నెల 20 దవతేది యగుచున్నది. ఈ శాసనమునందే మల్లవిష్ణువర్థనుని తండ్రియగు మూడవ విజయాదిత్యుడు శాలివాహనశకము 1079దవ సంవత్సరమునకు సరియైన క్రీ.శ. 1158దవ సంవత్సరము పదునొకండవ జనవరి తేదిని సింహాసనమెక్కినట్లుగ గూడ దెలుపబడినది. క్రీ.శ.1228దవ సంవత్సరమున వేంగిదేశమంతయు గణపతిరాజులయధీనమైనది గనుక మల్లవిష్ణువర్థనునితో నీ వంశమువారి పరిపాలనము తుదముట్టినది. ఈ మల్లవిష్ణు వర్థనుని శాసనములో విశేషచరిత్రాంశము లేవియుగానరావు. ఈ శాసనములో నీ వంశములోని రాజులనామములు మాత్రమె గాక వారి రాణుల నామములు గూడ పేర్కొనబడినవి. బేట విజయాదిత్యుని కొడుకు నుత్తమచాళుక్యబిరుదాంకితుండగు సత్యాశ్రయుడు గాంగవంశజు రాలయిన గౌరిదేవిని