పుట:Andhrula Charitramu Part-1.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మర్థ్యము, గ్రంథరచనాకౌశల్యము మాత్రమెగాక పరరాజులు దండెత్తివచ్చినప్పుడుగాని పరరాజులపైదాడి వెడలవలసివచ్చినప్పుడుగాని వెనుదీయక నడుమునకుగత్తికట్టుకొని సేనాధిపతులై సేనలనునడిపించియుద్ధములరణశూరులై పోరాడి పౌరుషము నెఱపినవారీశాఖాబ్రాహ్మణులే. కాబట్టి రాజ్యతంత్రము, కవితాసతియు వీరియధీనమైయుండుటచేత వీరిని మఱచి యాంధ్రదేశచరిత్రమువ్రాయుట సాధ్యముగాదు. ఒకవేళ సాధ్యమైనను శిరములేని మొండెమువలెనుండును. సారములేని పిప్పివలెను, ఉప్పులేని కూరవలెనుండును. వీరి యందింకొకవిశేషముగలదు. అభివృద్ధియందపేక్షగలిగి దురభిమానమంతగా లేక సంస్కరణాభిలషులై యే యెండకా గొడుగుపట్టుచు దేశకాల పాత్రస్థితులననుసరించి సంచరించినవారిలో వీరగ్రగణ్యులుగా నున్నారు.

రెండవకుడ్యవర్మ.

షట్సహస్రదేశమును జయించి సంపాదించిన మల్లవర్మ సంతతిలో నైదవతరము వాడగు రెండవకుడ్యవర్మ చాళుక్యరాజగు విమలాదిత్యునికి లోబడిన మాండలిక సామంతుడుగనుండి యాతనివలన గుద్రవారవిషయ పాలకత్వమును వహించి పరిపాలించిన ప్రసిద్ధవీరుడుగనుండెను. కాబట్టి యితడు క్రీ.శ.1011-1022 సంవత్సరముల నడుమనున్న వాడని నిశ్చయింప వచ్చును.

మొదటి గొంకరాజు.

కుడ్యవర్మ మునిమనుమడగు గొంకరాజు విమలాదిత్యుని మనుమడగు కులోత్తుంగ చోడదేవుని కాలమున వానికి లోబడిన సామంతుడై యాంధ్రమండలములోనొక భాగమును బాలించుచుండెను. ఈ వెలనాటి గొంకరాజు మంచనకవి విరచితమైన తేయూర బాహుచరిత్రమునందిట్లు వర్ణింపబడియున్నాడు.

" శా. ప్రాగ్దేశాపర దక్షిణోత్తరదిశా భాగప్రసిద్ధక్షమా
భుగ్దర్పాంతకుఁడేలె గొంకవిభుడీ భూచక్రమక్రూరతన్