పుట:Andhrula Charitramu Part-1.pdf/360

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రాజరాజ చోడగంగదేవుని టేకిశాసన మితరశాసనములవలె భూదానమును గూర్చినది కాదు. ఈ శాసనమునందలి యాజ్ఞమన్నేఱునకును మహేంద్రగిరికిని నడుమనుండు యావద్దేశమునకు వర్తించునదిగానున్నది. మహేంద్రగిరి గంజాము మండలములో నుత్తరభాగముననున్నది. మన్నేఱు నెల్లూరుమండలములోనికందుకూరు తాలూకాలో సింగరాయకొండ సమీపమున బ్రవహింపుచున్నది. ఈ హద్దులమధ్యనుండు దేశము యాకాలమున వేంగిరాజ్యముగ నుండెను. ఆంధ్రదేశమంతయు నింజమిడి (?) /యుండలేదు. ఈ టేకిశాసనము తైలికులనియెడి తెలికతెగ వారికి సంఘమునందు గౌరవనీయులయిన హక్కుల నొసంగునదిగా నున్నది.

తెలిక తెగవారు.

ఈ తెలికకుటుంబమువారు సహస్రశాఖాన్యయగోత్రులుగా విభాగింపబడియుండిరటగాని పది తెగలవారు మాత్రమే పేర్కొనబడియుండిరి. ఈ పది తెగలవారును తరతరములుగా చాళుక్యరాజకుటుంబమునకు సేవకులుగనుడి యీదేశమునకు వచ్చి విజయవాటిక (బెజవాడ) యందు స్థిరనివాసము లేర్పఱచుకొన్నట్టు వీరలు విశ్వసించుచున్నారు. గుంటూరు మండలములోని బాపట్ల గ్రామములోనున్న భావనారాయణస్వామి దేవాలయములోని రెండు శాసనములందీతెగవారిదానములనుగూర్చి ప్రశంసింపబడియుండెను. ముసునూళ్లగోత్రజాతుడొకడును మంజమూళ్లగోత్రజాతుడొకడును గలిసి శాలివాహనశకము 1076 అనగా క్రీస్తుశకము 1054 వ సంవత్సరమున దానశాసనములు వ్రాయించి యుండిరి. ఈ వెలందమూళ్ల తెగవారును టేకిశాసనము నందు నుదాహరింపబడిన వెలమసూళ్ల తెగవారు నొక్కరేయని తోచుచున్నది. అందొకశాసనమునందు. "స్వస్థియమనియమధర్మపరాయణ బ్రహ్మసంభవమను వంశాది సకలశాస్త్రవిశారదులం గణకపురాయ అయోధ్యాపురగజపురాధానాయకులం సత్యశౌవాభిమానులు గురదేవపదారాధిరులు పాలస్తభాగవకీస్థాన ప్రతిష్ఠితులు సహస్రశాఖాన్వయగోత్రులయిన శ్రీమధ్భజవాళశాసనులయిన తెవికి వేవురాయుండు వెలందనూళ్ల గోత్రుడు ఐనసూరిపట్టి" అని వ్రాయబడియుండుట