పుట:Andhrula Charitramu Part-1.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్ర దేశ కథాసంగ్రహము.

ఆంధ్రభృత్యవంశము

_____

మొదటి ప్రకరణము.

ఆంధ్రదేశము.

ఆంధ్రదేశ చరిత్రమును దెలిసిగొనుటకు బూర్వము “ఆంధ్రదేశ” మన నెట్టిదియో, దానిలెల్ల లెవ్వియో, విస్తీర్ణ మెంతయో, అందలి జనుల వేషభాషా మతంబులెట్టివో, ఎట్టి నాగరికతవహించి యుండిరో, కొంచెముగానైనఁ దెలిసికొనుట యావశ్యకము.

హిందూదేశము యొక్క మధ్యప్రదేశము నలంకరించి యుండిన వింధ్యపర్వతమునకు పైభాగ మార్యావర్తము లేక ఉత్తర హిందూస్థానమనియు క్రింది భాగము దక్షిణాపథము లేక దక్షిణ హిందూస్థానమనియు వ్యవహరింపబడుచున్నవి.

భరతఖండమునందలి దక్షిణాపథ దేశములలో నాంధ్రదేశము సుప్రసిద్ధమయినదిగ నున్నది. (ఆంధ + రస్ = అంధ = దృష్ట్యుపఘాతే యని ధాతువు) మనుష్యులు వసియింప శక్యముకాని యంధకారము కలది యగుటచే నౌత్తరాహులీదేశము నాంధ్రదేశమని వాడుచు వచ్చిరని కొందరు పండితులు చెప్పుచున్నారు.[1] ఆంధ్రులు నివసించుచుండు దేశముగాన దీనికి నాంధ్రదేశమని పేరు గలిగినదని మరికొందరు పండితులు తలంచుచున్నారు. ప్రాచీనకాలము నందు నాగరికులు వసియింప శక్యముకాని యంధకారబంధురమయిన మహారణ్యమధ్యమునందు మొదట వీరు నివసించియుండిన వారగుటజేసి యౌత్తరా

  1. ఆంధ్రాక్షరతతత్త్వము, పొరట 45