పుట:Andhrula Charitramu Part-1.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దవ సంవత్సరము మే నెల 22వతేదీన గాబోలు వేంగిసింహాసన మధిష్ఠించెనని చెప్పబడియెను. చెల్లూరు పిఠాపురము శాసనములు వీరచోడుని కిరువురన్నలుండిరని చెప్పియుండుటచేత నాయిరువురు చోడగంగు, ముమ్మడిచోడుడని యిప్పడు స్పష్టమైనది గనుక విక్రమచోడుడు వీరచోడునితమ్ముడని సిద్ధాంతము చేయవచ్చును. చెల్లూరు పిఠాపురము శాసనములలో జివరనీయబడిన తెదులు అనగా రాజ్యకాలముయొక్క 21, 23 వ సంవత్సరములని చెప్పినవి వీరచోడుని పరిపాలనమున కన్వయింపవలసినవిగావు. అదేరీతిగ టేకిశాసనము తుదను నీయబడిన చోడగంగుయొక్క రాజ్యకాలమునలోని పదునేడవ సంవత్సరము 1084-1617-1100-01వ సంవత్సరముతో సరియగుచున్నది గనుకను, వీరచోడుని చెల్లూరు శాసనము తుదనుగల తేదులు 1088+1021=1098-99 దవ సంవత్సరముతో సరియగుచున్నవి గనుకను వీరచోడుని శాసనములు రాజరాజచోడగంగు రాజప్రతినిధిగనుండు కాలమున వీరచోడునిచేలిఖింపబడినవి గానె నిశ్చయింపవలసియున్నది. వీరచోడుడు రాజప్రతినిధిగ నున్నకాలమున దండ్రిచే రప్పించికొనబడి యైదవయేట మరలబంపబడియెనని పిఠాపురము శాసనము చాటుచున్నది. ఆ నడుమకాలముననే చోడగంగు రాజప్రతినిధిగనుండి వేగిదేశమును బరిపాలించెను. చెల్లూరు శాసనమునందు చోడగంగు పాలకత్వమును విస్మరించుటయు, పిఠాపురము శాసనమున చోడగంగు పేరెత్తక పాలకత్వమునుదాహరించుటయు బరిశీలించిన పక్షమున చోడగంగు పాలనము తండ్రికి దృప్తిగలిగింపజాలక పోయననియు, చోడగంగునకును వీరచోడునకు పొందికలేదనియు, పొడకట్టకమానదు. వీనికి సర్వలోకాశ్రయుడనియు, విష్ణువర్ధనుడనియు బిరుదనామములు గలవు. ఇతడు వీరచోడునివలెనే జననాధనగరిని రాజధానిగ జేసికొని యందే నివసించియుండెనని శాసనములు చాటుచున్నవి, ఈజననాథనగరము రాజమహేంద్రవరము యొక్క మాఱుపేరని కొందఱు తలంచుచున్నారు. రాబర్టు స్యూయలుగారు కాకినాడకు జేరియుండినజగన్నాథపురమనియూహించుచున్నారు గాని రాజమహేంద్రనగరమని చెప్పుటయె సముచితముగానుండును.