Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతడనేక యుద్ధములయందు వీరచోడునకు జయమును సమకూర్చెను. వీరిరువురనడుమ బ్రేమ మగ్గలముగ నుండెను. ఈ మేడమార్యుడు వైష్ణవభక్తాగ్రేసరుడయినట్టు గన్పట్టుచున్నాడు. ఇతడు మిక్కిలి గుణవంతుడగుటచేత గుణరత్నభూషణుడనెడు బిరుదునామమును బొందెను. ఇతడు పెద్దలను బొడగన్న భృత్యునికైనడి వినయము జూపునట, బాంధవులయెడగౌరవముసూపునట బీదలయినసజ్జనులకు దానధర్మములు చేయుచుండునట, మఱియు నితడు పిఠాపురము దాక్షారామములయందు రెండు సత్రములు నిర్మించి బ్రాహ్మణులకు నిరతాన్నప్రదానము సలుపుచుండెను. ఇతడు చెల్లూరు గ్రామములో నొక విష్ణవాలయమును నిర్మించి యొకకోనేరును ద్రవ్వించెను. ఆ విష్ణ్వాలయమునకే వీరచోడ విష్ణువర్ధన మహారాజు కాలేరగ్రహారమును దానము చేసి యుండెను. ఇటీవల మహారాష్ట్రరాజులకడ పీష్వాలుగ నుండిన మహారాష్ట్ర బ్రాహ్మణులవలెనే యాంధ్ర బ్రాహ్మణులుగూడ చాళుక్య రాజులకడ బురోహితులుగను మంత్రులుగను ఆస్థానకవులుగను, మాత్రమేగాక ఖడ్గమునుజేతబట్టి శౌర్యప్రతాపములు చూపి యుద్ధముసేయునట్టి రణకౌశము లయినసేనాధిపతులుగ గూడ నుండెరి. ఈ మేడమార్యుడు కాకతీయాంధ్ర ప్రభువయిన మొదటిప్రతాపరుద్రునితో యుద్ధముజేసి యోడిపోయినట్టుగన్పట్టుచున్నది.

రాజరాజచోడగంగు.

(క్రీ.శ.1084 మొదలుకొని 1088-89వఱకు)

ఇతడు కులోత్తుంగ చోడదేవునకు మధురాంతకదేవియందు జనించిన జ్యైష్ఠకుమారుడు. గోదావరిమండలములో రామచంద్రాపురము తాలూకాలోని టేకి గ్రామమునందు రాజరాజచోడగంగునిశాసనము బయలుపడకపూర్వము చరిత్రకారులెల్లరును రాజరాజచోడగంగుని మూడవతమ్ముడయిన విక్రమచోడుడే కులోత్తుంగ చోడదేవుని జ్యైష్ఠకుమారుడని వ్రాసియుండిరి. టేకిశాసనము చోడగంగు జ్యైష్ఠకుమారుడని దెలిసి చరిత్రకారుల బూర్వపు వ్రాతలనన్నిటిని తాఱుమాఱు చేసినది. ఇతడు శాలివాహనశకము 1006ల సంవత్సరము జ్యైష్ఠశుద్ధపూర్ణిమాగురువానరమునా డనగా క్రీస్తుశకము 1084