పుట:Andhrula Charitramu Part-1.pdf/356

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మూహింపవచ్చును. ఇట్లు కొందఱు దక్షిణ దేశీయులు వచ్చి యిచ్చటస్థిరవాసము లేర్పఱచుకొనుట కళింగగంగవంశజుడగు మొదటి నరసింహుని కాలమువఱకు జరుగుచుండెనని వీరనరసింహదేవుని పదునేనవసంవత్సర మనగా శాలివాహనశకము 1072వ సంవత్సరములో విశాఖపట్టణమున లిఖింపబడిన మఱియొక శాసనముంబట్టి దెలియుచున్నది. సాండలాయనికొల్లముగ్రామవాసియొకడు విశాఖపట్టణములోని కరుమాణిక్యాళ్వారుదేవాలయమునకు దానముచేసినట్టు చెప్పబడియున్నది. ఈ పాండలాయనికొల్ల మనుగ్రామము క్వీలాండికి నుత్తరమున నున్నది.[1]

వేగి దేశపాలకులు.

కులోత్తుంగ చోడదేవుని కాలమున వేగిదేశమునకు రాజప్రతినిధిగ నియమింపబడినవాడు రాజరాజనరేంద్రునిసోదరుడును కులోత్తుంగ చేడదేవునితండ్రియు నగు విజయాదిత్యుడు మొదటివాడని చెప్పియుంటిమి. ఈవిజయాదిత్యుడు 1077వ సంవత్సరమువఱకును వేగి దేశమును బాలించి మృతినొందగా గులోత్తుంగ దేవుడు తన రెండవకుమారుడయిన రాజరాజును రాజప్రతినిధిగా నియమించెను. ఇతడీపదవిని వహించినతరువాత వీనికి సుఖమును సురక్షణమును లేకపోయెను. వీనికి గురుపాద సేవవలన గలిగెడి యానందమునంటి యానంద మీరాజ్యపాలనాధికార మీయనందున రోసి వేగుదేశము నొక్క సంవత్సరము మాత్రము పరిపాలించి తనతల్లిదండ్రులకడకు వెడలిపోయెను.[2] తరువాత 1078 దవ సంవత్సరమున వానితమ్ముడయిన వీరచోడుడు రాజప్రతినిధిగ నియమింపబడయెను. ఇతడు బాహుబలము గలిగిన మహారణశూరుడు. ఇతడు 1084వఱకును వేగిదేశమును బాలించినతరువాత రాజధానికి రప్పించుకొనబడి కులోత్తుంగజ్యేష్ఠపుత్రుడగు రాజరాజచోడగంగు రాజప్రతినిధిగ నియమింపబడియెను గాని 1088-89దవ సంవత్సరమున చోడగంగునకు బదులుగా మరల వీరచోడుడే రాజప్రతినిధిగనియమింపబడియెను.

  1. Malabar Gazetteer p. 36
  2. Sou. lnd. Ins., i 60.