పుట:Andhrula Charitramu Part-1.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళింగదండయాత్ర.

విశాఖపట్టణము లేక కులోత్తుంగచోడపట్టణము.

కులోత్తుంగుడు కళింగదేశముపై రెండుమాఱులు దండువెడలియుండెను. మొదటియాత్ర తనరాజ్యకాలములో నిరువదియాఱవసంవత్సరమనగా 1095-96వ సంవత్సరమునకు బూర్వమె జరిగియుండును. రెండవది తనపరిపాలనావసానదశయందు జరిగియుండును. అదియె కళింగట్టుపారణి యనుకావ్యమునందు వర్ణింపబడినది. మొదటి దండయాత్ర దక్షిణకళింగముపై మాత్రమె నెఱపబడినది. ఉత్తరకళింగమును బాలించుచుండిన అనంతవర్మ చోడగంగు ఈదండయాత్రయందంతగా దానుసంబంధము కలిగించుకొనియుండలేదుగాని రెండవదండయాత్రయందు కులోత్తుంగదేవునికి తోడ్పడియెను. ఈ యనంతవర్మ చోడగంగకులోత్తుంగచోడుని కూతురగు రాజసుందరికి కళింగరాజగురాజరాజువలన జనించినవాడుగావున గులోత్తుంగునకు దౌహిత్రుడు. అనంతవర్మ చోడగంగునకు లోబడియుండిన యేడుగురు కాళింగులు తిరుగబడినందున వారలను వశపఱచుకొనుటకై కులోత్తుంగుడు దండెత్తివచ్చెను. క్రీ.శ. 1078వ సంవత్సరములో కళింగసింహాసనమెక్కిన అనంతవర్మ దేవుని శాసనమొకటి విశాఖపట్టణమునగలదు ఆ శాసనములో విశాఖపట్టణమునకు కులోత్తుంగుచోడదేవుని పేరేయీపట్టణమునకు బెట్టబడినదని నిశ్చయముగా జెప్పవచ్చును. ఈ మొదటిదండయాత్రలో నితడు సింహాచలపర్యంతమును బోయినట్లుగానంబడుచున్నది. సింహాచలములో నీతనిపేరిటి శాసనమొకటి యిప్పటికిని నిలిచియున్నది. ఒకవేళ నీ దండయాత్రయుగూడతనమనుమడయిన అనంతవర్మ దేవునిపక్షముననే జరిపియుండవచ్చును. విశాఖపట్టణములోని శాసనము ద్రావిడభాషలోనికి భాషాంతరీకరింపబడినది.(No 90 of 1909) ఈ శాసనములో దానప్రతిగ్రహీత మాలమండలము ('Malabar) లోని యొక వర్తకుడు. తనయనుచరులయిన దక్షిణదేశీయులను గొందఱినితనమనుమనిదైన దక్షిణకళింగములో నిలుపుటయె యీప్రథమకళింగదండయాత్రయొక్క ముఖ్యోద్దేశమని మన