దేవాలయమని పేరుగలిగినది.[1] కొన్ని నాణెములపైన చోళనారాయణనామము గన్పట్టుచుండుటచేత నయ్యవి వీనివేయని యూహింపబడుచున్నవి. కళింగట్టుపారణి యను కావ్యము వీనిని కులోత్తుంగ చోళుడనియు, కరికాళచోళుడనియు,బిరుదరాజభయంకరుడనియు, అభయుడనియు, జయధరుడనియు బేర్కొనుచున్నది. ఇతడు తుదకు చక్రవర్తి, త్రిభువనచక్రవర్తి యనుబిరుదునామములనుగూడ వహించెను.
కులోత్తుంగుని రాజధాని.
కులోత్తుంగుని రాజధాని గంగాపురి ఇయ్యది గంగకుండపురమనియు, గంగయికొండచోళపురమనియుగూడ పిలువంబడుచుండెను. ఈ పట్టణము మొదట కులోత్తుంగచోడదేవుని మాతామహుడగు రాజేంద్రచోడునిచే నిర్మింపబడినది. ఆ రాజేంద్రచోళునకు గంగయికొండ చోళుడుని నామాంతరము గలదు. ఈపట్టణమునకు దరువాత రెండవముఖ్యపట్టణము కాంచీపురముగ నుండెను.
కులోత్తుంగునిరాణులు.
ఇతడు రాజేంద్రదేవుని కూతురగు మధురాంతకదేవిని వివాహమాడియామెయందు రాజరాజచోడగంగును, రాజరాజముమ్మిడిచోడుని, వీరచోడుని, విక్రమచోడుని, మఱిముగ్గురిని మొత్తమున నేడుగురు పుత్రులను రాజసుందరియను కూతురిని గాంచెను. మఱియును దీనచింతామణి ఎళిశైవల్లభి, త్యాగవళ్లియను మఱిముగ్గురు రాణులుగలరు. దీనచింతామణి చనిపోయినతరువాత నామెస్థానమును త్యాగవల్లి వహించెనట! ఈ త్యాగవల్లి రాజుతో సమానమైనయధికారమును నెఱపుచుండెనని కళింగట్టుపారణియను కావ్యమునందు జెప్పబడియుండెను. కులోత్తుంగదేవుని కూతురగురాజసుందరి కళింగరాజయిన రాజరాజుకిచ్చి వివాహము చేయబడియెను.
- ↑ Ep. Ind. Vol IV. p. 230