Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నువారమునకు సరియైన క్రీస్తుశకము 1053 వ సంవత్సరము నవంబరు నెల 28వతేదీని మంత్రిపురోహితసేనాపతియువరాజదౌవారిక ప్రధానసమక్షంబున నారాయణభట్టునకు నగ్రహారముగాననుభవింప ధారపోసెను. ఈ నారాయణభట్టు సంస్కృతకర్ణాటప్రాకృత పైశాచికాంధ్రభాషాసుకవిరాజశేఖరుండనియు కవీభనజ్రాంకుశుండనియును, అష్టాదశావధారణచక్రవర్తియనియు నందు బేర్కొనంబడి యుండెను. మఱియు హరితగోత్రుండు నాపస్తంబసూత్రుండు నైనకాంచనసోమయాజిప్రపౌత్రుండును, కాంచనార్యునిపౌత్రుండును శౌచాంజనేయనిపుత్రుండుననియుంగూడ పేర్కొనబడియుండెను. ఈ నారాయణభట్టుతండ్రి యగు శౌచాంజనేయునకు అకలంకాశాంకనామాత్యుడను నామాంతరము గలదు. ఈ యమాత్యవరునకు సామికాంబవలన జనించినవాడె మననారాయణభట్టు. ఈకవిరాజశేఖరుని సహాయముతో మననన్నయభట్టు మహాకవి మహాభారతమును దెలిగింపబూనెను. మహాభారతమును నన్నయభట్టు సాంతముగా దెలిగింపక యారణ్యపర్వము నడుమనే విడిచిపెట్టుటకు గారణము రాజనరేంద్రుని మరణమేకాని వేఱొండుగానేరదు. కావున భారతము రాజనరేంద్రుని కాలముననే నన్నయభట్టు మరణము నొందియుండుటగాని లోకాపవాదము ప్రకారము నన్నయభట్టునకు మతిభ్రమణము కలిగియుండుటగాని జరిగి తమ్మూలమున భారతము తెలిగింపబడక నిలిచియుండునేని అంతటి యభిమానముగలరాజనరేంద్రుడంతటికవిరాజశేఖరుండయిన నారాయణభట్టుచే బూర్తిచేయింపకుండె ననుమాట విశ్వసింపదగినదికాదు. కాబట్టి యాంధ్రభారతరచనము జరుగుచున్నకాలమునందు రాజనరేంద్రుడు మరణమునొంది యుండవలయును. రాజనరేంద్రునికుమారుడగురాజేంద్రచోడుడు సింహాసనమునకు రాకపోవుటయు, రాజనరేంద్రునికి బిమ్మట రాజనరేంద్రుని తమ్మడగు విజయాదిత్యుడు రాజ్యమాక్రమించుకొనుటయు సంభవించినదిగావున గొంతవఱకు దేశోపద్రవము సంభవించి మనకవివరులచే బ్రారంభింపబ