పుట:Andhrula Charitramu Part-1.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాళుక్యవంశభూషణము శ్రీవిష్ణువ
ర్ధనుడే మహీశు తాతలకు దాత
భృతకుమారారామ భీముండు చాళుక్య
భీముడే నృపకులాబ్ధికివిధుండు
రాజమహేంద్రనరస్థాతరాజన
రేంద్రుడెక్కువ తాత యే విభునకు
నంధ్రదళదానపూసేంద్రుడగు నుపేంద్ర
ధరణివల్లభుడేరాజు తండ్రితాత
ఘనుడు పేంద్రాఖ్యుడెవ్వని కన్నతండ్రి
యతడు విశ్వేశ్వరుడు లక్క మాంబసుతుడు."

అను పద్యములో రాజనరేంద్రుని రాజమహేంద్రవరస్థాతయని యొక మహద్విషయముగ జెప్పినదానిని బట్టిచూడ రాజనరేంద్రునకును రాజమహేంద్రపురవరమునకును విశేషసంబంధము గలదనియును, రాజమహేంద్రపురంబునందుండి రాజ్యపరిపాలనము చేసిన మొదటి చాళుక్యప్రభువు రాజనరేంద్రుడే యని సూచించుచున్నట్లు గన్పట్టగలదు.

రాజరాజనరేంద్రభోజరాజులు సమకాలీనులు.

రాజమహేంద్రవరము రాజధానిగా నాంధ్రదేశమేలిన రాజరాజనరేంద్రుడునుధారాపురము రాజధానిగా మా‌ళవదేశము నేలినభోజమహారాజును సమకాలీనులగుటమాత్రమేగాక సమానలక్షణములనుగూడ గొన్నిటిని గలిగియుండిరని తెలిసికొనినప్పు డెంత యానందముకలుగుచున్నది. భోజరాజు 1018 వ సంవత్సరము మొదలుకొని1060దవ సంవత్సరమువఱకును నలువది సంవత్సరములకుబైగా రాజ్యపాలనము చేసియుండెను, భోజమహారాజుసంస్కృత పండితులను, సంస్కృతకవులనాదరించి సంస్కృతభాషాకవులను మాత్రమేగాక దేశభాషాకవుల కగ్రహారములు మొదలగునవి యిచ్చి పోషించి దేశభాషల నుద్ధరించెను.