లిసికొనియుంటిమి.[1] విమలాదిత్యునికి కూండవాంబా దేవియందు జనించిన జైష్ఠపుత్రుడే మన యీరాజరాజ విష్ణువర్ధనుడు. ఇతడు రాజరాజచోడుని మనుమడగుటంజేసి వీనిని చోడులు రాజరాజనిపిలుచుచుండిరి. చాళుక్యులు వీనిని విష్ణువర్ధనుడనుచుండిరియ రాజరాజనుపేరువహించిన వేంగిరాజులలో నితడు మొదటివాడును విష్ణువర్ధన నామమును వహించిన వేంగిరాజులలో నితడు తొమ్మిదవవాడునై యుండెను. వీనికి విజయాదిత్యుడను తమ్ముడుగూడగలడు.
ఈ రాజరాజనరేంద్రుడుశాలివాహనశకము 944వ సంవత్సరము శ్రావణ బహుళద్వితీయాగురువారము నాడు త్తురాభాద్రనక్షత్రమున సింహాసన మెక్కినట్లుకోరుమల్లి నందమపూడి శాసనములవలన విస్పష్టమగుచున్నది.[2] ఈ కాలము లెక్కనేసిచూడగా క్రీస్తుశకము 1022 వ సంవత్సరము జూలయినెల పంతొమ్మిదవతేదితో సరియగుచున్నది. మఱియును రాజనరేంద్రుని ముమ్మనుమడయినకులోత్తుంగు చోళదేవుడు గోదావరి మండలములోని కోరంగికి సమీపమున నుండు చెల్లూరు గ్రామము కొలనుకాటమ(?) నాయకున కిచ్చినట్టియు
- ↑
శ్లో. తస్మాచ్చాశుక్యచూడామణి రధవిమలాదిత్య దేవాన్మహీశా
చ్చోడక్ష్మాపాలలక్ష్యా ఇవరచితతపోః కూండవాయాశ్చ దేవ్యా
జాతశ్రీరాజరాజోరజనికరకుల శ్రీమ దంబోధిరాజో
రాజద్రాజన్యసేవ్యా మభృతిభుజబలాద్రాజ్యలక్ష్మీంపృథివ్యామ్అని రాజరాజనరేంద్రునికోరుమల్లిశాసనమునంగూడ స్పష్టముగా జెప్పబడినది.
- ↑ Ind. Ant. Vol XIV. p. 55-, Ep Ind Vol IV pp 300-309.
"వసంతితిలక. యోరక్షీతుం వసుమతీమ్ శకవత్సరేషు
వేదాంబురాశినిధి వర్తిషుసింహగేర్కే
కృష్ణద్వితీయదివసోత్తర భాద్రికాయాం
వారేగురోర్వణిజలగ్ననరేభిషిక్తః "