పుట:Andhrula Charitramu Part-1.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నది. ఈమె రాజునకుంపుడుకత్తెగా బేర్కొనబడియెను. ఈ శాసనము భట్టదేవునిచే రచింపబడినది. ఇప్పటి కృష్ణామండలములోని తణుకు తాలూకాలో దణుకు గ్రామమునకు నేడు మైళ్ళ దూరమున అత్తిలి గ్రామము గలదు. ఇది పూర్వమత్తిలినాడు విషయమునకు ముఖ్యపట్టణముగనుండెను. [1]

(7)గణక విజయాదిత్యునికడ నుద్యోగిగా నుండిన పాండురంగని వంశములోని వాడును తనకడ నుద్యోగిగా నున్నవాడునునగు దుర్గరాజుచే విజయవాటిక (బెజవాడ)లో నిర్మింపబడిన జైనాలయమునకు గూడ అత్తిలినాడు విషయములో మల్లిపూడి గ్రామమునకు దానము చేసినట్లుగ మల్లిపూడి శాసనమువలన ద్యోతకమగుచున్నది.[2]

తన భృత్యవర్గములోజేరి తనయెడగడు భక్తింగూర్చెడు కుప్పనామాత్యుండను వానిని సమ్మానించి దానధర్మముల దనిపెనని యమ్మరాజవిష్ణువర్ధనుని వాండ్రముశాసనముదెలుపుచున్నది. <re>Ep.Ind., Vol.IX., p.152; (2)No.538, Public, 28 July 1909, para 61</ref>

ఇతడిట్లనేక దానధర్మములుచేసి ప్రఖ్యాతిగాంచినవాడు. ఇతడు జైనులకుజేసిన దానధర్మములనుబట్టిచూడగా జైనమత పోషకుడుగ గూడ గన్పట్టుచున్నాడు. బ్రాహ్మణులను జైనులను సమానదృష్టితో జూచియుండెను . ఇతడిరువది సంవత్సరములు నిరాతంకముగా దేశపరిపాలనము గావించెను.

రెండవ తాళరాజ విష్ణువర్ధనుడు.

అమ్మరాజు విష్ణువర్ధనునకు బిమ్మట రాజ్యమునకు వచ్చిన బేటవిజయాదిత్యుని జంపి రాజ్యమాక్రమించుకొని యుద్ధమల్లుని కొడుకు నెలదినములు పరిపాలనము చేసెనని యిదివఱకు దెలిపియుంటిమి. ఈ తాళరాజు కొడుకు రెండవ యుద్ధమల్లుడు. ఈ రెండవ యుద్ధమల్లునకు మహారాజరాజ పరమేశ్వర బాడబుండును, తాళరాజ విష్ణువర్ధనుడు నను నిరువురు కుమారులుండిరని యీ రెండవ తాళ

  1. Epi.Ind., Vol.vii, pp.177-192
  2. Ibid.Vol.IX. pp.47-56