పుట:Andhrula Charitramu Part-1.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) గుద్రవార విషయములోని (గుడివాడ) పాంబఱ్ఱు (పామఱ్ఱు) గ్రామములో గొన్ని భూములను పట్టవర్ధని వంశములో జేరియుండి బొద్దియను నామాంతరముగల యువరాజ బల్లాల దేవ వేలాభటునకు దానము చేసెను. ఇందు బేర్కొనబడిన పట్టవర్ధనివంశజులు కుబ్జవిష్ణువర్ధనుని కాలమునుండియు జాళుక్యులకడ మంత్రిత్వాది పదవుల వహించి శోభిల్లుచుండిరి.[1]

(3) వెలనాండు విషయములోని (వెలనాటి సీమ అనగా ప్రస్తుత గుంటూరు మండలములోని చందవోలు ప్రాంతదేశము) యెలవఱ్ఱు గ్రామమునుత్తరాయణ సంక్రాంతి కాలమున ధారవోసెను. ఈ శాసనము పోతనభట్టుచే విరచింపబడిన జొంటాచార్యునిచే లిఖింపబడినది.[2]

(4) ఉత్తరాయణసంక్రాంతి కాలమున వేంగినాడు విషయములోని గుంటుగొలను (గుంటుగొలను) గ్రామములో గొంతభూదానము చేసియుండెను. అమ్మరాజ విజయాదిత్యుని మామయగు నృపకాముని యొక్కయు, అత్తయగు నయమాంబ యొక్కయు కోరికమీద నీ దానము చేయబడినదిగ జెప్పబడియెను.[3]

(5)అది‌వఱకు గుద్రవార విషయములో నొకగ్రామమున గొంతభూమికుల బ్రాహ్మణున కొకనికి దానముచేయబడి యేకారణముచేతనో మరలగైకొనబడిన యా భూమినే రాజు పునర్దానము జేసినట్లుగ నొకశాసనము జెప్పుచున్నది.

(6) అడ్డకాలి గచ్ఛకు సంబంధించి వలహరిగణములో జేరిన జైనశ్రావకియగు చామెకాంబగురు వయిన అర్హనంది యను జైనాచార్యునకు సర్వలోకాశ్రయజైనభవనము యొక్క భోజన శాలకొఱకు అత్తిలినాడు విషయములోని కంచుం బఱ్ఱు గ్రామమున(కంచుమఱ్ఱు) గ్రామమును దానము చేసెను. ఇందుదాహరింపబడిన చామెకాంబ పట్టవర్ధని కుటుంబములోనిదని దెలుపబడి[4]

  1. Ind. Ant, Vol, viii, y. 73;
  2. Ibid, Vol xii, p 91.
  3. Ibid, Vol xili, p.248;
  4. South, Ind. Ins VI,p.46No. 38.