బేటవిజయాదిత్యుడు.
అమ్మరాజవిష్ణువర్ధనునకు వెనుక రాజవంశమున నంతఃకలహములు జనించి యధికములై పదిసంవత్సరములవఱకు శాంతి లేక రాజ్యపదవికై యొండొరులంజంపుకొనుచు రాజకుమారులు రాజ్య మాక్రమించుకొనజూచుచుండిరి. అమ్మరాజు మరణానంతరము వాని జ్యైష్ఠకుమారుడగు విజయాదిత్యుడు రాజ్యమునకు వచ్చెను. వీనికి బేటరాజను నామాంతరము గలదు. విజయాదిత్యులలో నితడయిదవవాడుగ నుండెను. ఇతడు సింహాసన మధిష్టించిన పదునేను దినములలోనే యుద్ధమల్లునికొడుకయిన తాళరాజు వీనిని సింహాసనవిహీనుని గావించి చెఱసాలయందు బెట్టించి రాజ్యమునువశముజేసికొని పరిపాలింపసాగెను.
తాళరాజు.
యుద్ధమల్లుని కొడుకయిన యీతాళరాజు రాజ్యమాక్రమించుకొని ముప్పదిదినములు రాజ్యపాలనము చేసినతరువాత చాళుక్యభీముని ద్వితీయపుత్రుడును నాలవ విజయాదిత్యుని సోదరుడునైన విక్రమాదిత్యు డీతనిని జంపి రాజ్యమాక్రమించుకొనియెను.
విక్రమాదిత్యుడు.
చాళుక్యభీమునికొడుకయిన యీ రెండవవిక్రమాదిత్యుడు వేగి త్రికళింగదేశములను 925,926 సంవత్సరములలో పదునొకండు మాసములు పరిపాలించిన పిమ్మట అమ్మరాజ విష్ణువర్ధనుని కొడుకగు భీముడీతని రాజ్యపదచ్యుతిని గావించి రాజ్యము నాక్రమించుకొనియెను.
భీముడు.
అమ్మరాజ విష్ణువర్ధనుని తనూజుడును నయిదవ విజయాదిత్యుని తమ్ముడునైన యీ మూడవ భీముడు విక్రమాదిత్యుని జయించి 926-27 సంవత్సర