పుట:Andhrula Charitramu Part-1.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణకవిజయాదిత్యుడు.

(క్రీ,శ, 844 మొదలుకొని 888వఱకు)

కలివిష్ణువర్ధనునికి బిమ్మట సింహాసన మెక్కినవాడు వానిజ్యైష్ఠకుమారుడయిన విజయాదిత్యు డనువాడు. వేంగిదేశమును బరిపాలించిన విజయాదిత్య నామధారులయిన రాజులలో నితడు మూడవవాడు. ఇతడు గణిత శాస్త్రమునందు పండితుడగుటతచేత గణకవిజయాదిత్యుడని పిలువబడుచు వచ్చెను. ఇతడు క్రీ,శ, 844మొదలుకొని 888వఱకు నలువది నాలుగు సంవత్సరములు నిరంకుశముగా దేశమును బరిపాలించెను. వీనికి యువరాజవిక్రమాదిత్యుడనియు, యుద్ధమల్లుడనియు నిరువురు తమ్ములుండిరి. కొన్ని శాసనములయందు గుణగాంకయనియు, గుణకనల్లయనియుబేర్కొనబడియుండుట చేత గొందఱు వీనిని గుణాంక విజయాదిత్యుడని పేర్కొనుచున్నారుగాని "అంక కారఃసాక్షాత్" అని గణిత శాస్త్రమునందు బ్రజ్ఞావంతుడగుటచేత నితడు గణకవిజయాదిత్యుడని ప్రసిద్ధిగాంచినట్లుగ అమ్మరాజ విజయాదిత్యుని కంచు మఱ్ఱుశాసనము స్పష్టముగ గారణము జెప్పుచుండగా గుణాంకవిజయాదిత్యుడనుటకంటె గణక విజయాదిత్యుడని గ్రహించుటయె యొప్పిదముగా నుండును. ఈ గణకవిజయాదిత్య మహారాజునకు సమస్తభువనాశ్రయు డనుబిరుదు నామము మాత్రమే గాక మనుజప్రకారుడు, రణరంగశూద్రకుడు, విక్రమధవళుడు, పరచక్రరాముడు, నృపతి మార్తాండుడు, బిరుదాంక భీముడు మొదలగు బిరుదనామములెన్నో గలవు. కలి‌విష్ణువర్ధనుని భార్యయు, గణకవిజయాదిత్యుని తల్లియు నగుశీలమహాదేవి రాష్ట్రకూటరాజకుటుంబములోని దైనను, గణకవిజయాదిత్యుని కాలమున రాష్ట్రకూటులకును ఆంధ్రచాళుక్యులకును గల స్నేహబంధములు త్రెంపి వేయబడినవి. రాష్ట్రకూటరాజయిన రెండవకృష్ణుడు గణక విజయాదిత్యుని కయ్యమునకు బిలుచుటవలన నించుకయు గొంకక యాంధ్రసైన్యముతోడ రాష్ట్రకూటులపై దాడివెడలి వారలతో ఘోరయుద్ధము సలిపి యోడించి