పుట:Andhrula Charitramu Part-1.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాదిత్య భట్టారకుడు దేపూడి గ్రామనివాసులయిన బ్రాహ్మణులకు భోగపురవిషయములోని ముంజేఱు గ్రామము నాతురకాలమున దానము చేసెనని చెప్పబడినది. ఆతురకాలమనగా మరణావస్థయుందున్న కాలమని చెప్పదగును. ఈ శాసనమును బట్టియు, వీనికుమారుని శాసనమునుబట్టియు నితనికి విక్రమాదిత్య భట్టారకుడని పేరు గూడగలిగియున్నట్లు గానంబడుచున్నది. మఱియు నితనికి మంగియువరాజను కుమారుడు గలడు. ఈ మంగియువరాజుయొక్క దానశాసనము గూడ గలదు. కళింగదేశములో భోగపుర విషయములోని కోడుంకవిళంగవాడయను గ్రామమును చంద్రగ్రహణ సమయమున ముంజేఱు నివాసులగు103 బ్రాహ్మణులకును, శివాలయమునకును దానము చేసినట్టు తెలిపెడి తామ్రశాసనముగలదు. ఈమంగియువరాజు తనతాతతండ్రులవలెనె విజయసిద్ధియను బిరుదునామములను వహించియుండెను. ఈ తండ్రికొడుకల కిరువురకును ఎలమంచి వాసకమనివీరిశాసనములలో నుదాహరింపబడియుండెను. ఈ యెలమంచి యెల్లమంచిలియను పేరున బిలువంబడుచు విశాఖపట్టణ మండలములోని సర్వసిద్ధితాలూకాలోనున్నది. ఇచ్చట కుబ్జవిష్ణువర్ధనుని నాణెములు కొన్ని దొరకినవి.

కోకిలవర్మ మహారాజు.

ఇతడు మంగివర్మమను మడుగను వినయాదిత్యవర్మ కుమారుడుగను బేర్కొనబడి యుండెను. వీనిశాసనములు రెండు భీముని పట్టణము తాలూకా లోని ముంజేఱు గ్రామమున దొరకినవి. పైనిజెప్పిన కొక్కిలిరాజు యొక్కయు, వానికొడుకు మంగియువరాజుయొక్కయు శాసనములు దొరకినచోటనే యివియును దొరకినవి. అంతమాత్రముచేత నీ కోకిలవర్మయు, కొక్కిలియు నొక్కడేయని చెప్పరాదు. వేఱ్వేఱు తండ్రులను గలిగియుండుటచేత నొక్కరుగారనుట నిర్వివాదాంశామనుటకు సందియములేదు గాని యీ కోకిలవర్మ పేరు చాళుక్యలశాసనములం దెచ్చటను గానరాదు. ఈ కోకిలవర్మ దానశాసనములు రెండింటిలో నొకదానియందు భోగపురవిషయము మధ్యమ కళింగములోనిదని పేర్కొనబడియుండెను. ఎలమంచి వీనికిని రాజధానిగ నుండెనని చెప్పబడినది.