Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జు శాసనముల వలన దెలియుచున్నది. [1]దక్షిణ దేశముల బాలించిన చాళుక్యరాజులలో మొదటివాడు జయసింహుడు. విష్ణుశర్మచేత సంరక్షింపబడిన చళుక్యపర్వతమున గౌరిని గూర్చి తపస్సు చేసి సేవలను గూర్చికొని వచ్చి దక్షిణ హిందూస్థానమునంతను జయించెనని చెప్పబడిన విజయాదిత్యతనూభవుండగు విష్ణువర్ధనుడు తాను పొందిన జయములను బట్టి జయసింహుడను బిరుదు నామమును బొందినట్టు కనబడుచున్నది.

ఒక చిత్రమైన సంబంధము.

ఆంధ్రసామ్రాజ్యమునకు లోబడి క్రీస్తు శకము రెండవ శతాబ్దమున హారితిపుత్త్ర శాతకర్ణియను నాంధ్రరాజు కర్ణాటకమును బాలించుచుండెననియును వానికి వనవాసి (Banavasi) రాజధానిగనుండెననియు నింతకు బూర్వము దెలిసికొనియుంటిమి. తరువాత నా దేశము గాంగులకును పల్లవులకు నటు పిమ్మట కదంబులకును స్వాధీనమై నాల్గవ శతాబ్దాంతము వఱకును వారలచే బరిపాలింపబడియెను. ఈ ప్రాచీన కదంబులు జైనమతావలంబకులుగ నుండిరి. మఱియు వీరలు మానవ్యగోత్రులమనియు హారితిపుత్త్రులమనియును జెప్పుకొనిరి, [1] కదంబులకు దరువాత నుత్తర కర్ణాటకమునకు రాష్ట్రకూటులు ప్రభువులయిరి. ఆఱవశతాబ్దాదిని చాళుక్యుడయిన జయసింహుడు కర్ణాటకమును బాలించెడి రాష్ట్రకూట రాజయిన కృష్ణుని కుమారుడగు నింద్రుని నుక్కడించి రాజ్యమాక్రమించుకొనియెనని యేపూరుమి రాజు శాసనములు చాటుచున్నవని పైనిజెప్పియుంటిమి. ఈ చాళుక్యులును తాము మానవ్యగోత్రులమనియును, హారితిపుత్త్రుల మనియును జెప్పుకొనిరి. వీరిలోనుండి మఱియొక శాఖగాజీలి యాంధ్రదేశమును బాలించిన పూర్వచాళుక్యులును గూడ తాము హారితిపుత్త్రుల మనియును మానవ్య గోత్రులమనియును జెప్పుకొనిరి. చాళుక్యుల శాసనములలోని గాథలో హారితిపుత్త్రులను పేరెట్లు వచ్చినదియు దెలుపబడియుండలేదు. ఒక శాసనమునందు హారితిపుత్త్ర యనునది హారితపుత్త్రయని పేర్కొనబడినది. విక్రమాంక దేవ

  1. 1.0 1.1 Jour. R.A.S., Vol.II., III., IV.; Ind. Ant., Vol.VII., p.12