యావశ్యకముగాకపోదు. జైనమత స్థాపకుడయిన మహావీరుడు గౌతమబుద్ధునకు సమకాలీనుడనియును బంధువుడనియును జెప్పెదరు. ఇతడు మగధదేశములోని పాటలీపుత్రనగరమునకు నిరువదియేడు మైళ్లదూరముననున్న వైశాలియను పట్టణమున జనించెను. అప్పుడు రాజ్యముచేయువాడు రాజుగాక క్షత్రియకుటుంబములోని నాయకులనేకులు గలిసి రాజ్యపరిపాలనము సేయుచుండిరి. నాయకసత్తాకరాజ్యము (Oligarchical Republic) అని పిలిచెదరు. ఈ మహావీరుడట్టిక్షత్రియనాయకులలో "నతివంశ"జుడగు నొకనాయకునియొక్క కనిష్ఠపుత్రుడుగానుండెను. ఇతడు ముప్పదేండ్లప్రాయముననే పారసనాథులను సన్న్యాసులలో గలిసి రెండు సంవత్సరములు సంచారము జేసిన తరువాత స్వతంత్రమతమును స్థాపించి నలువదేండ్లవఱకు ధర్మబోధన సేయుచు నుత్తరదక్షిణమాగధములయందు మఠములగొన్నిటి నేర్పాటు చేసి క్రీస్తువునకు బూర్వము 490 దవ సంవత్సరములో బరమపదము గాంచెను. ఈ మతావలంబకులను మొదట నిర్గ్రంధులని పేర్కొనిరి. అనగా వీర లేగ్రంథముల నీశ్వరదత్తములని విశ్వసించువారుకారని యర్థము. ఈ మతము వారు తమమతస్థాపకులను మహావీరులనిగూడ"జిను" లని చెప్పినందున నీ మతమున ఇటీవల జైనమతమని పేరువచ్చినది. కొంతకాలము గడచిన తరువాత దిగంబరులనియు శ్వేతాంబరులనియు వీరలు రెండుతెగలుగ నేర్పడిరి. ఈ మతము క్రమక్రమముగా దక్షిణమునకు వ్యాపించెను. అకలంకుడను జైనాచార్యుడొకడు కాంచీపురములో బౌద్ధులనోడించి వెడలగొట్టెనట. జైనులు ద్రావిడకర్ణాటభాషలలో చక్కని యుద్గ్రంథములను వ్రాసిరి. ప్రస్తుతము హిందూదేశమున 15 లక్షల జైనులు మాత్రమున్నారు.
జైనమత సిద్ధాంతములు.
1 వేదములు పౌరుషేయములు; 2 అరూగముడను సర్వేశ్వరుడొకడు మాత్రము గలడుగాని సర్వశక్తిమంతుడయ్యును తటస్థునివలె మారకుండును. 3 మనసదాచరణ దురాచరణలే మనలరక్షించుటకు శిక్షించుటకుగారణములుగాని యీశ్వరుడు మనలనిష్టమువచ్చినట్లు రక్షించుటకు శిక్షించుటకు గార