Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సువర్ణమును దానము చేసెను. కైలాసనాథుని దేవాలయపు స్తంభముమీద విక్రమాదిత్యుని శాసనము లిఖియింపబడినది. ఈ విక్రమాదిత్యుని దండయాత్ర పల్లవ రాజ్యాధికార విజృంభణమునకు చేసినట్లుగ గన్పట్టుచున్నది.

అపరాజితవర్మ.

నందిపోతవర్మకు దరువాత అపరాజితవర్మ రాజ్యభారమును వహించి శ్రీపెరుంబీయముకడ పాండ్యరాజగు రెండవ వరగుణుని జయించెను గాని విధివశంబున నెనిమిదవ శతాబ్దాంతమున ఆదిత్యచోడునిచే జయింపబడియెను. ఈ యుద్ధముతో పల్లవరాజ్యాధికారము చోడుల వశమయ్యెను, పల్లవరాజులు చోడరాజులకు సామంతులయిరి. పల్లవులు చోడులచే జయింపబడినట్లుగ నే పశ్ఛిమ చాళుక్యులు గూడ రాష్ట్రకూటులచే జయింపబడిరి. ఇట్లు పల్లవులయొక్కయు, పశ్చిమచాళుక్యులయెక్కయు ప్రభయంతయు నెనిమిదవ శతాబ్దముతో తగ్గిపోయి రాష్ట్రకూటులయొక్కయు, చోడులయొక్కయు, వేంగిరాజులయిన పూర్వచాళుక్యులయొక్కయు ప్రభ వికసింపసాగెను. ఇట్లు తొమ్మిదవశతాబ్దమునాటికి కాంచీపుర పల్లవరాష్ట్ర మంతరించిన మాత్రమున నింకపల్లవరాష్ట్రములు లేనని భావింపరాదు. ఆంధ్ర ద్రావిడ కర్ణాటకదేశములయందు పల్లవులు వేఱ్వేఱు శాఖలవారు ప్రత్యేకరాష్ట్రములను గలిగియుండి పదుమూడవ శతాబ్దాంతమువఱకు పరిపాలనము సేయుచుండిరి. కాని వారల యధికారములు వారిభూములను దాటిపోయి యుండలేదు.

హౌనుత్సాంగు.

క్రీస్తుశకము 640 దవ సంవత్సర ప్రాంతమన జయసింహుడను పూర్వచాళుక్యరాజు వేంగిదేశమును, మొదటి నరసింహవర్మయను పల్లవరాజు కాంచీపురమునందును బరిపాలనము చేయుచుండ దక్షిణాపథదేశములను జూచుటకై చీనాదేశపు యాత్రికుడగు హౌనుత్సాంగు బయలువెడలి మొదట వేంగిపురమునకు వచ్చెను. వేంగీపురమును పింకిలో ((Phing-ki-lo) అని పిలిచినాడు. ఈ వేంగిదేశమునకు దక్షిణమున మహాంధ్రములేక ధాన్యకటకదేశము కల