రెండవపరమేశ్వరవర్మ.
ఇతడు మూడవమహేంద్రవర్మ సోదరుడు. రాజసింహునికొడుకు. సోదరునికి బిమ్మట రాజ్యభారమును వహించెను. ఇతడు కాంచీపురములోని వైకుంఠ పెరుమాళ్ల దేవాలయమును నిర్మించినవాడు. ఇయ్యది యొకశాసనములో పరమేశ్వర విష్ణుఘృతమని పిలువంబడియెను. తిరమంగయాళ్వారు స్తోత్రములలో పరమెచ్చర విన్నగరమని పేర్కొనంబడియెను. ఈ పరమేశ్వరవర్మ మరణానంతరము రాజవంశమునందు గృహకల్లోలము జనించి రాజ్యక్రాంతి సంభవించినట్లు గన్పట్టుచున్నది.
నందివర్మ పల్లవమల్లుడు.
పరమేశ్వరవర్మకు బిమ్మట సింహసనారోహణమునుగూర్చి వివాదము సంభవించి నటుల కానకుడి తామ్రసింహాసమునుందు సూచింపబడినది. పరమేశ్వరవర్మజ్ఞాతియగు నందివర్మ రాజ్యాధిపత్యము వహింపవలయునని ప్రజలెన్నికొనుటచేత నందివర్మ పల్లవమల్లుడు సింహాసనమెక్కెను. నందివర్మ పల్లవమల్లుని ఉదయేంద్రము శాసనములో నందివర్మ సేనాధిపతియగు నుదయచంద్రుడు స్వహస్తముతో జిత్పమయుండను పల్లవరాజును బంపినట్లుగ జెప్పబడియుండుటచేత గృహకల్లోలవిషయము స్పష్టమగుచున్నది. పల్లవరాష్ట్రమునందు జనించిన కలవరమును మార్పును దూరమునుండి వీక్షించుచుండిన పశ్చిమచాళుక్యరాజగు వినయాదిత్యుని మనుమడగు రెండవ విక్రమాదిత్యుడు తమకు బ్రబల శత్రువులుగనుండిన పల్లవుల రూ?పడంచుటకదియే యదనని యూహించి యమేయబలములం గూర్చికొని గుం?డక విషయమై దండెత్తివచ్చితన్నెదుర్కొనిన నందిపోతవర్మను ఘోరసంగ్రామమున జయించి తఱిమిగొట్టెను. ఈ రెండవ విక్రమాదిత్యుడు తరువాత కాంచీపురమును బ్రవేశించి పూర్వధర్మము ననుసరించి పట్టణమును నాశము చేయకుండుటయె గాక బ్రాహ్మణులకు బీదవారలకు దానధర్మములు సేయుటయె గాక కాంచీపురములోని కైలాసనాథునకు బురాతననామమగు రాజసింహేశ్వరునకు పెక్కువేల