మించుకొనియెను. మహేంద్రవర్మయు చాళుక్యులను గొన్ని యుద్ధములలో జయించెను.
నరసింహవర్మ.
మహేంద్రవర్మ తరువాత రాజ్యభారమువహించిన నరసింహవర్మ కాలమున బల్లవులయధికారము మిక్కిలి విజృంభించి యున్నత స్థితికి వచ్చినది. వీనికి మొదటి నరసింహవర్మయందురు. ఇతడు పల్లవుల గర్భశత్రువై భయంకురుడు గానుండిన పశ్చిమచాళుక్యుండగు రెండవపులకేశివల్లభుని రాజధానియగు వాతాపినగరమును ముట్టడించి గైకొనియెను. ఆ ముట్టడికాలమున పులకేశివల్లభుడు మృతుడయ్యెననియెదరు. ఆ దెబ్బతో జాళుక్యులు 13 సంవత్సరములు వఱకు నణగియుండిరి. పల్లవరాజగు నరసింహవర్మయధికారము దక్కనుకు మైసూరునకును వ్యాపించి నిరంకుశమైయుండెను. ఈ నరసింహవర్మ చాళుక్యులనుజయించి వాతాపినగరము గైకొన్న విషయము వాతాపికి నిప్పటి పేరగు బాదామిలోని నరసింహవర్మశాసనమే వేనోళ్లజాటుచున్నది. నరసింహవర్మకు మహామల్లుడని బిరుదుగలదు. ఇతడిటీవల వాతాపికొండనరసింగపోతరాయలని పిలువంబడుచుండెను. ఈ యుద్ధము క్రీస్తుశకము 947 వ సంవత్సరమున జరిగియుండెనని నిశ్చయింపబడినది. ఈ యుద్ధము సింహళదేశచరిత్రమగుమాహవంశమునందు బేర్కొనబడుటయేగాక తమిళపెరియ పురాణమునందుగూడ సూచింపబడినది.
రెండవమహేంద్రవర్మ.
నరసింహవర్మతరువాత సింహసమునకు వచ్చినవాడు మహేంద్రవర్మ. ఈ రెండవ మహేంద్రవర్మ కాలమున సహితము చాళుక్యులు తలయెత్తలేదు. ఇతడును తండ్రివలెనె నిరంకుశముగ బరిపాలనము చేసియుండెను.