Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంహవిష్ణువంశము.

(575 మొదలుకొని 740 వఱకు)

పశ్చిమచాళుక్యులు 743 వ సంవత్సరమున రాష్ట్రకూటులచే బదభ్రష్టులగువఱకు చాళుక్యులును పల్లవులును సామాన్యముగా ఘోరయుద్ధములు సలుపుచునే యుండిరి. ఈకాలమునందు సింహవిష్ణువంశములోని రాజులు తొమ్మండ్రుగురు కాంచీపురమును బాలించుచుండిరి. వీరిలో మొదటివాడు సింహవిష్ణువు. ఇతడు 575 వ సంవత్సరమున బరిపాలనము చేయుచుండినట్లు దెలిసికొనబడినది. సింహవిష్ణువు సింహళరాజును పాండ్యచోళకేరళరాజులను జయించెను.

మహేంద్రవర్మ.

(900-975)

సింహవిష్ణువు కొడుకును వానితరువాత రాజ్యభారమును బూనినవాడునైన యీ మొదటి మహేంద్రవర్మ తిరుచనాపల్లి చెంగలుపట్టు, ఉత్తరార్కాడు జిల్లాలలోని కొండలను జెక్కించి దేవాలయముల నిర్మించి మహాబలిపురమనియెడి మామళ్లపురములోని ప్రసిద్ధికెక్కిన సప్తగోపురములలో నొకకొన్నింటిని నిర్మించి తనపేరును శాశ్వతముగా నిలుపుకొనియెను. ఆర్కాడునకును ఆర్కోణమునకును, నడుమ మహేంద్రవాడియను పట్టణము మహేంద్రుని కొలను నిర్మించెను. నేడు శిథిలములై పోయిన వాని చిహ్నములు మాత్రము గాన్పించుచున్నవి. ఈ చెఱువుగట్టుమీద విష్ణుని కంకితము చేయబడిన గుహాలయమొకటియుండెను. ఆనాటి రాజవర్గములో బేరెన్నిక గాంచినవాడును బహుసమర్థుడును చాళుక్యుడునునగు రెండవపులకేశివల్లభుడు దండెత్తివచ్చి యీ మహేంద్రవర్మ మొదలగు పల్లవులనుజయించి వేంగిరాష్ట్రము [1]

నాక్ర

  1. Prof. Kielhorn (op.cit, p. 20)