పుట:Andhrula Charitramu Part-1.pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నెదుర్కొని ఘోరసంగ్రామమమును సలిపి యోడిపోయెను. చాళుక్యులకు విజయము కలిగెను. గాని విజయాదిత్యుడు యుద్ధములో జంపబడియెను. ఈయుద్ధము కడపమండలములో నెచ్చటనో జరిగియుండును. విజయాదిత్యుని భార్యగర్భవతిగానుండి ముదివేమగ్రహారమున విష్ణుభట్టసోమయాజి నింటదాగి యుండెను. ఈ ముదివేము కడపమండలములోని పెద్దమడియ మనుగ్రామమేయని జయంతి రామయ్యపంతులుగారు నిర్థారణచేసియున్నారు. త్రిలోచనపల్లవుని వంశకర్తనుగా జెప్పుకొనిన రాజవంశములు పెక్కులుగలవు. కరికాలుడను చోడరాజు త్రిలోచనపల్లవుడు తనకు సామంతరాజుగ నుండెనని చెప్పుకొని యున్నాడు. మఱియు నాతడు కాంచీపురమును సువర్ణముతో బ్రకాశింప జేసెనని చెప్పబడియుండెను. నిజముగా ద్రిలోచనపల్లవుడను నొకరాజుండిన యెడల నాతడు కాంచీపురము రాజధానిగ నాంధ్రదేశములోని కొంతభాగమును బరిపాలించియుండి యుండును.

నవీనకదంబులు_మయూరశర్మ.

ప్రాచీనపల్లవులు పాలించినదేశ మాంధ్రదేశముగా నుండినది. ఇప్పటి గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, కడప, కందవోలు(కర్నూలు), అనంతపురము, బల్లారి మండలము లాకాలమున బల్లవరాష్ట్రములలోనివిగ నున్నవి. మొట్టమొదట బ్రాహ్మణులుగానుండిన వనవాసి(Banavasi) కదంబులు పల్లవుల యధికారమును ధిక్కరింప బ్రయత్నించిరి. మయూరశర్మయను బ్రాహ్మణుడే నవీనకదంబ వంశమునకు మూలపురుషుడుగ నుండెను. ఈ మయూరశర్మ విద్యాభ్యాసము నిమిత్తము పల్లవరాజధానికి బోయియుండెను. ఒకనాడొక పల్లవాశ్వికునితో మయూరశర్మకు ఘోరమైన పోరాటము సంభవించెను. ఆ జగడమునకు గారణమేమో, అదియెట్లు పర్వవసించెనో చెప్పబడి యుండలేదు. ఒకనాడు మయూరశర్మ "అయ్యో!ఈ కలియుగములో

[1]

  1. Animal Report on Epigraphy for 1905-1906 part II para 15.