మొకటి నెల్లూరుమండలములోని చెందలూరుగ్రామమునఁ గాంపించినది. ఈ కుమారవిష్ణునిశాసనము కాంచీపురమునుండి ప్రకటింపఁబడినది. [1] ఈ శాసనములోని లిపిని పరిశోధించిన డాక్టరు హాల్ ట్జుగారీనలుగురు పల్లవులును రెండవనరసింహవర్మకును సింహవిష్ణువునకును నడుమనుండి యుందురని యూహించుచున్నారు. పల్లవమహారాజగు కుమార విష్ణువు కర్మకరాష్ట్రములోని భాగమగు కవచకారభాగములోని చెందలూరు గ్రామములో నెనమన్నూరు పట్టికలపొలమును అభిరూపనివాసియును. కౌండిన్యగోత్రుడును నగు భావస్కందత్రాతయను బ్రాహ్మణునకు దానముచేసినట్లుగ నీశాసనమున బేర్కొనబడినది. ఈ వంశజులు విష్ణుభక్తులయిన భాగవతులుగా బేర్కొనబడిరి. వీరును భారద్వాజగోత్రులుగను పల్లవులుగనుండిరి. ఈ రాజులును పైజెప్పినరాజులును కేవలము తమభుజబలపరాక్రమముచేతననేకరాజులనిజయించి యశ్వమేధాదియాగముల బెక్కించి నాచరించినట్లుగ గన్పట్టుచున్నది. విష్ణుగోపయని, కుమారవిష్ణువని పేరులు వహించియుండుటజూడ వైష్ణవమతము తలయెత్తి ప్రబలుచుండినకాలమైయుండుననితోచుచున్నది. వైష్ణవాళ్వారులు కొందఱయిన నా కాలమునందుండియుండవలయును. అశ్వమేధయాగముల నాచరించితిమని గరువముతో జెప్పుకొనినది వాస్తవముగాక శివస్కందవర్మశాసనము ననుసరించినదిగానున్నది. వీరవర్మవంశజులకును వీరికిని గలసంబంధము దెలియురాకున్నది.
కమ్మరాష్ట్రము.
ఈ యిరువంశములవారును 5,6 శతాబ్దములలోనివారని చెప్పవచ్చును. కుమార విష్ణుశాసనమునందు బేర్కొనబడినకర్మంక లేక కమ్మంక రాష్ట్రము పూర్వచాళుక్యరాజగు మంగియువరాజు చెందలూరు శాసనమన కమ్మరాష్ట్రమని పేర్కొనబడినది. జగ్గయ్యపేటశాసనములో నుదాహరింపబడిన కమ్మకరాఠవిషయము మేమిదివఱ కూహించిన కమ్మమెట్టుగాక యీకమ్మరాష్ట్రమెయని పైశాసనములబట్టి తేటబడుచున్నది. ఈ కమ్మరాష్ట్రమెయని పైశాసనములబట్టి తేటబడుచున్నది. ఈకమ్మరాష్ట్రమె తరువాత కమ్మనాడుగ బేర్కొనబడినందుకు దృష్టాంతములనేకములుగలవు. నన్నయ
- ↑ Eph.Ind.Vol.viii pp.233 236