కందుకూరయనునదియె కందుకూరు. ఇవియన్నియును నెల్లూరు మండలములోనివే. తనయైదవపరిపాలన సంవత్సరమున సింహవర్మ ముండరాష్ట్రములోని పీకిరెయను గ్రామమును విలాసశర్మయను బ్రాహ్మణునకు దానము చేసినట్లుగ జెప్పబడినది. ఈ సింహవర్మయను మంగదురు(మంగలూరు) శాసనమును బ్రకటించిన సింహవర్మయు నొక్కడేయని డాక్టరు ఫ్లీటుగారు వ్రాసియున్నారు.[1] పీకిరె శాసనములోని ముద్రికయు కొంచెమించుమించుగా మఱనపల్లి శాసనములోని ముద్రికను బోలియున్నది. సింహవర్మ మంగదూరు శాసనము దశవపురమునుండి ప్రకటింపబడినది. [2]మంగదూరు శాసనములో రెండవసింహవర్మతండ్రివిష్ణుగోపుడని వర్మ తీసివేయబడి పేర్కొనబడినది. ఈశాసనమునందును విష్ణుగోపుడు యువమహారాజుగనే చెప్పబడియెను. దీనింబట్టి యితడెన్నడును రాజ్యాధికపత్యము వహించియుండలేదని యూహింప వలసి వచ్చుచున్నది. వీరకోచవర్మ (వీరవర్మ) యొక్క మునిమనుమని శిథిలమయిపోయిన శాసనమొకటి దర్శిగ్రామమున గాన్పించినది. ఈ శాసనములో నుదాహారింపబడిన రాజుయొక్క పేరు చెడిపోయినది[3]. దర్శనపురము దశనపురమైనది. దశనపుర మే నేడు దర్శియని పిలువబడుచున్నది. మెనుమూరనునది గుంటూరు మండలములోని మనుమూరు కావలయును. పాలక్కడయనునది యెద్దియోదెలియరాదు. ఈవంశపు రాజులు కాంచీపురమునుండి పరిపాలనము చేసినట్లు గానరాదు. వీరలు భారద్వాజ గోత్రులయిన పల్లవులు. వీరు కాంచీపురమునుండి తఱిమివేయ బడియుండవచ్చునని కొందఱు తలంచుచున్నారు గాని యట్లుతలంచుటకు సరియైన హేతువుగానరాదు.
స్కందవర్మకుమార విష్ణువంశము,
స్కందవర్మ కుమారవిష్ణువు; కుమార విష్ణువుకుమారుడు బుద్ధవర్మ, బుద్ధవర్మకుమారుడు కుమారవిష్ణువు. ఈ రెండవకుమారవిష్ణునిదానశాసన