పుట:Andhrula Charitramu Part-1.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాలంకాయనులయిన పల్లవులనియె భావింపవచ్చును. కళింగాధిపులమని చెప్పుకొనిన యీనందప్రభంజనవర్మ చండవర్మలను గూర్చిన చరిత్రము దెలియరాకున్నది.

స్కందవర్మవంశము.

స్కందవర్మ కొడుకు వీరవర్మ; వీరవర్మకొడుకు రెండవ స్కందవర్మ; రెండవస్కందవర్మ కొడుకు యువమహారాజు విష్ణుగోపవర్మ; విష్ణుగోపవర్మ కొడుకు సింహవర్మ; వీరిలో విష్ణుగోపవర్మ యొక్కయు సింహవర్మయొక్కయు శాసనములు నెల్లూరు మండలమున గాన్పించినవి, ఇవియన్నియును సంస్కృతభాషలో వ్రాయబడినవి. ఈ వంశములో గడపటి వాడయిన సింహవర్మమాత్రమే రాజ్యపరిపాలనము చేసినట్లు గన్పట్టుచున్నది గాని తక్కినవారి సంగతి తెలియుచుండలేదు. వీరిశాసనములు దశవపురము పాలక్కడ మెన్మతూర పట్టణములనుండి ప్రకటింపబడినవి. ఈ పట్టణములు నెల్లూరు గుంటూరు మండలములలోనివేగాని యన్యములుగావు. రాజకేసరవర్మయను చోడరాజుయొక్క తిరుక్కాలుక్కుండ్రముశాసనములో నొక స్కందశిష్యునిపే రుదాహారింపబడినది. [1]ఈ స్కందశిష్యుడు సింహవిష్ణు వంశములోని మొదటి నరసింవర్మకు బూర్వుడుగా నుండెనని యూహింపబడుచున్నాడు. సంస్కృతశాసనములలో నుదాహారింపబడిని యిరువురి స్కందవర్మలలో నొకడు స్కందశిష్యుడు కావచ్చునని శాసనపరిశోధకులు చెప్పుచున్నారు గాని యింకను విచారింపవలసి యున్నది. విష్ణుగోపవర్మ యువమహారాజుగా నుండినపుడు ముండరాష్ట్రములోని ఉఱవపల్లి గ్రామమును కందుకూరగ్రామములోని దేవాలయమునకు దానముచేసెనని పాలక్కడనుండి ప్రకటించిన యుఱవపల్లి శాసనమనం జెప్పబడినది. [2]ఇందు చెప్పబడిన ముండరాష్ట్రమె చోడరాజగు మూడవకులోత్తుంగుని నెల్లూరి శాసనమున ముండైనాడుగ బేర్కొనబడినది.[3]

  1. Ep. Ind Vol. III. p. 279;
  2. Ind. Ant, Vol V.
  3. Reports on Epigrappy In Madras. G- O. Public No195 of 1894.