రక పాదభక్తుడని కూడ బేర్కొనబడినది. [1] చండవర్మ శాసనమునకును విజయనందివర్మ శాసనమునకు దగ్గిఱపోలిక విశేషముగ గన్పట్టుచుండుటచేత బరిశోధకులు కొందఱు విజయనందివర్మ తండ్రియగు చండవర్మయు నితడు నొక్కడేయని యూహించుచున్నారు. వీరిరువురొక్కరయినను గాకపోయినను సమకాలికులని చెప్పవచ్చును. శ్రీకాకుళమునకును నరసన్నపేటకును నడుమనుండు సింగపుర మె సింహపురమై యుండవచ్చునని యూహింపబడుచున్నది. చండవర్మ శాసనములోని రాజముద్రికపైన "పితృభక్తః" యని వ్రాయబడినది.
నందప్రభంజనవర్మ.
ఈ నందప్రభంజనవర్మయు గలింగదేశమును బాలించిన పూర్వరాజులలో నొకడుగా నున్నాడు. కళింగాధిపతియైన యీ నందప్రభంజనవర్మ మహారాజుయొక్క దానశాసనమొకటి శ్రీకాకుళమునగాన్పించినది. [2] నందప్రభంజనవర్మ సారపల్లినగరమునుండి యీశాసనమును బ్రకటించినవాడు. ఇతడు దేవరాత గోత్రులయిన చారణులకును హంశ్చంద్ర స్వామియని బ్రాహ్మణునికొఱకును దేయపటమను గ్రామమును దానముచేసెనని చెప్పబడియున్నది. ఈశాసనములోని లిపి చండవర్మశాసనములోని లిపిని బోలియుండుటచేతను, కళింగాధిపతియని యుభయశాసనములయందును బేర్కొనబడి యుండుటచేతను, వీనిశాసనములోని ముద్రికపైన దండవర్మ ముద్రికలో వ్రాయబడిన "పితృభక్తః" అను నక్షరములే వ్రాయబడియుండుటచేతను వీరలిరువురు నొక్కకుటుంబములోని వారేయై యుందురని శాసనపరిశోధకులభిప్రాయపడుచున్నారు. ఈశాసన పరిశోధకులూహించిన యూహలే సరియైనదయైన యెడల వీరినిగూడ