వారి శాసనములు మఱికొన్ని కలవు. బప్పాయనునది ప్రాకృతము. తండ్రియనియర్థము. శివస్కందవర్మ శాసమున బప్పాయనురాజు పేర్కొనబడియెను. అదిరాజు పేరుగా నుదాహరింపబడినది గాని నిజముచేత దానిభావమది కాదని తోచుచున్నది. శివస్కందవర్మ బప్పాయని తనతండ్రిని ప్రశంసించియుండెనోమో? ఈశాసనమును భాషాంతరీకరించిన డాక్టరు బర్నెలుగారు విజయనందివర్మ వాదవర్మ మహారాజుయొక్క జ్యేష్ఠపుత్రుడని పేర్కొనుచున్నారు. విజయనందివర్మ తల్లికులాంకదేవి, అభ్యుదయ పరంపరాభివృద్ధికై చిన్నపాకూరు వాకాగ్రహారములో నివసించుచుండిన వేదాధ్యయన సంపన్నులును, నానాగోత్ర సంభవులులైన 157 గురు బ్రాహ్మణోత్తములకు కూడూహార విషయము(వేంగిదేశము) లోని వడానూరుపల్లియను గ్రామమును ధారాదత్తముచేసెను. ఇంతకన్నను వీనిని గుఱించి మనకేమియును దెలియరాదు. ఇతడు నాలుగవశతాబ్దములోని వాడని తెలుపుటకు సంశయింపబనిలేదు.
కందవర్మ -అత్తివర్మ.
ఆనంద ఋషిగోత్రసంభవుడయిన కందరవర్మయను మహారాజుయొక్క పుత్రిక పేరుగల ప్రాచీనశాసనమొకటి కృష్ణామండలములోని చెజ్జరాలయను గ్రామమునందు దొరకినది. [1] ధరణికోటయొక్క ప్రాచీననామమగు ధాన్యకటకమును త్రికూటపర్వతమును కందరుని గూర్చి ప్రశంసించు సందర్భమునదాహరింపబడినవి. మఱియు గుంటూరుమండలములోని గోరంట్ల గ్రామములోఅత్తివర్మయొక్క శాసనమొకటిగన్పెట్టబడినది.[2] ఆనందగోత్ర సంభవుడయిన కందరుని యొక్క పుత్రుడగు అత్తివర్మయను రాజు ఆతుక్కూరు(ఆతుకూరు) గ్రామమును, కృష్ణవేణినదియొక్క దక్షిణతటముననుండు తాతికుంట గ్రామములో అష్టాశతపట్టి పరిమాణముగల పొలమును కొట్టిశర్మయనుబ్రా