Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండి బ్రాహ్మణులను రప్పించినగాని వచ్చినవారిని నాదరించిగాని యగ్రహారములు మొదలగువాని నిచ్చి దేశమున నిలుపుటచేత వీరలే మొదట వేంగినాటి శాఖాబ్రాహ్మణులుగా నే పరిగణింపబడుచుండిరి. క్రీస్తుశకము నాలుగవశతాబ్దము 340దవ సంవత్సర ప్రాంతమునందు నలహాబాదునగరమున నశోకుని స్తంభముమీద సముద్రగుప్తునిచే వ్రాయించబడిన శాసనమునందు వేంగిపుర ముదాహరింపబడినది గనుక నంతకు బూర్వమునుండియు ననగా క్రీస్తుశకము రెండవశతాబ్దమునుండియో మూడవశతాబ్దమునుండియో వ్యవహారములోనికి వచ్చియుండును.

సముద్రగుప్తుని దండయాత్ర.

స్వామిదత్తుడు, మహేంద్రవర్మ, హస్తివర్మ, విష్ణుగోపవర్మ.


నాలుగవశతాబ్ద ప్రారంభమున నుత్తరహిందూస్థానమును గుప్తరాజులాక్రమించుకొని పరిపాలించుచుందనుభుజబలపరాక్రమముచేత వెంటనే నానా ముఖముల దమరాజ్యమును విస్తరింపజేయసాగిరి. వారిలో సముద్రగుప్తుడు నెపొలియన్ చక్రవర్తి వంటివాడగుటచేత దిగ్విజయయాత్ర మొదలుపెట్టి దక్షిణహిందూదేశముపై గూడదండెత్తివచ్చెను. ఈతని దక్షిణ దిగ్విజయమువలన నాకాలమున మహానది మొదలుకొని కాంచీపురమువఱకును గలదేశమును బాలించురాజుల పేరును వారుండు ముఖ్యపట్టణములును దెలియుచున్నవి. సముద్రగుప్తుడు దక్షిణకోశలమును బాలించుమహేంద్రుని జయించి మహాకాంతారమునకు వచ్చి యచ్చటి వ్యాఘ్రరాజునోడించి పిమ్మట కళింగదేశమునకు వచ్చెను. పర్వతముమీదనున్న కొత్తూరుదుర్గమును ముట్టడించి యాదుర్గాధిపతియగు స్వామిదత్తునినోడించి యీరందపళ్లను బాలించు దమనుని జయించి తరువాత దేవరాష్ట్రమును బాలించుకుబేరుని,పిమ్మట అవముక్తాధీశ్వరుండయిన నీలరాజును, అటుపిమ్మట పిష్ఠపురమును బాలించుమహేంద్రవర్మను, అనంతరము వేంగిని బాలించుహస్తివర్మను, పాలక్కడను బాలించునుగ్రసేనుని, కుష్ఠబపురిని బాలిం