పుట:Andhrula Charitramu Part-1.pdf/259

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దైవహన వర్మ చేత వ్రాయబడినది. పంతూరను గ్రామమెద్దియో దెలియరాకున్నది. ఈ గ్రామము జయవర్మచే బ్రాహ్మదేయము క్రింద నీయబడినది. ఇరువది నాలుగు భాగములుగ విభజింపబడి యెనమండ్రు బ్రాహ్మణులకు దానము చేయబడినది. అందు గౌతమీగోత్రుడగు సర్వగుప్తార్యునకు 8 భాగములును, తానవ్యగోత్రుడనగు సవిజ్ఞార్యునకు 3భాగములును, గోగణార్యునకు 3 భాగములను, కౌండిన్యగోత్రుడయిన భావనార్యునకు 2 భాగములను, భారద్వాజ గోత్రుడయిన రుద్రవిష్ణ్వార్యునకు 1 టిన్నర భాగమును, కర్షణాయన గోత్రుడయిన యీశ్వర దత్తార్యునకు 1 టిన్నర భాగమును, ఔపమాన్యవగోత్రుడయి రుద్రఘోషార్యునకు 1 భాగమును, కౌశికగోత్రుడయిన స్కందద్రార్యునకు నరభాగమును నొసంగబడినవి. జయవర్మ మహేశ్వరభక్తుడని చెప్పబడియుండుటచేత నితడు శైవమతాభిమాని యని సూచింపుచున్నది. ఇతడు తనశాసనమునందు దాను పల్లవుడని చెప్పుకొని యుండకపోయినను వీరిని పల్లవుడనియె విశ్వసింపవచ్చును. ఇంతకంటెవీని చారిత్రము మనకేమియు దెలియరాదు.

విజయదేవవర్మ.

ఇతడు వేంగీ దేశమును బరిపాలించిన వారిలో మిక్కిలి ప్రాచీనుడు. వీని శాసనమొకటి నూతనముగా గనిపెట్టబడినది.[1] ఈ శాసనము ప్రాకృతభాషలో వ్రాయబడి వేంగీపురమునుండి ప్రకటింపబడినదగుట చేత నిది పురాతనమైనదనుటకు సందియములేదు. విజయదేవవర్మ జయవర్మకు దరువాతి వారును విజయనంది వర్మకు బూర్వుడును నని చెప్పుటకు సంశయింపంబనిలేదు. జయవర్మకు కూడూరు రాజధానిగ నుండెనని చెప్పబడినది. కూడూహరా విషయమునకు (వేంగి రాష్ట్రము) మొదట కూడూరును తరువాత వేంగీపురమున రాజధాని గనుండుట చేతను, విజయదేవ వర్మ వేంగీపురమునుండి యీశాసనమును బ్రకటించుటచేతను, జయవర్మ తరువాత వాడని తేటపడుచున్నది. విజయనందివర్మశాసనమువలేగాక యియ్యది ప్రాకృతములో నుంటచేత నతనికంటె

  1. District Manual of Godavary