Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్రులనునోడించి దేశమును స్వాధీనము చేసికొనవలయునుగాని యూరక స్వాధీనమగుననుట విశ్వసింపదగినది కాదు.

అట్టిఘోరసంగ్రామ మేదియును జరగినట్లుగా గానరాదు. శాసనములందును జెప్పబడియుండలేదు. కాబట్టి శివస్కందవర్మగాని వానిపూర్వులు గాని క్రొత్తగా నాకాశమునుండి దిగివచ్చినవారుగాక దేశములోని వారేయైయుండవలయును. పల్లవుడనని చెప్పుకొనుచుండిన యీశివస్కందవర్మ యాంధ్రభృత్యులలో నుదహరింపబడిన శివస్కందవర్మయెగాని యన్యుడుగాగన్పట్టడు. మత్స్యపురాణమునుందు "అంధ్రాణాం సంస్థితా (తే) రాజ్యేతే షాంభృత్యాన్వయెపృపాసపైవాంధ్రాభవిష్యంతి" అని యాంధ్రభృత్యులకు వెనుక సప్తాంధ్రులు రాజ్యపాలనము సేయుదురని చెప్పంబడియెను. శకయవనపహ్లావాదు లాంధ్రులలో గలిసిపోయి యాంధ్రరాజుల కడనూడిగము సేయుచుండిరని యిదివఱకె తెలుపబడియుండెను. అట్లాంధ్రులయియున్నతస్థితికి వచ్చినకుటుంబములతో నాంధ్రరాజుల సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరని గూడ వ్రాసియుంటిమి. ఇట్లు సంబంధబాంధవ్యములు జరుపుచుండుటచేత రాజకుటుంబములలో బలుశాఖలేర్పడినవి. ఇందుకు దృష్టాంతముగ గొందఱిని జూపవచ్చును. హారితపుత్రశాతకర్ణుడు విష్ణుదత్తులవంశములోని వాడని బనవాసిలోని యొక శాసనమున జెప్పబడినది. వాసిష్టీపుత్ర శాతకర్ణుడు కర్దమకరాజులవంశములోనివాడని యొకశాసనమున జెప్పబడినది. మాధరపురుషదత్తుడు ఇక్ష్వాకులవంశములోనివాడని బేతవోలు(జగ్గయ్యపేట) శాసనమున జెప్పబడినది. శివస్కందవర్మ పల్లవులలోని వాడని మైదవోలు హర్పనహల్లి శాసనములు చెప్పుచున్వి, యవనశకపహ్లవాదులాంధ్రులలో గలిసిన తరువాత వేఱ్వేఱు తెగలుగ నుండవచ్చునయినను లిక్ష్వాకులు కావచ్చును. శకనులు విష్ణుదత్తులు కావచ్చును. పహ్లవులు పల్లవులు కావచ్చును. ఈయిక్ష్వాకులును, ఈ విష్ణు దత్తులును, ఈ కర్దమకులును ఈ పల్లవులును కేవలము విదేశస్థులు గారు. ఆంధ్రులయొక్కయు, యవనశకపహ్లావాదులయొక్కయు రక్తసమ్మేళనమువలన జనించిన మిశ్రజాతులవారే కాని