ఆంధ్రరాజులు ధాన్యకటకము రాజధానిగా నాంధ్రరాజ్యమును గొంచెమించుమించుగా క్రీస్తుశకము 240 దవ సంవత్సరమువఱకు బాలించినట్లు గన్పట్టుచున్నది గావున నాంధ్రభృత్యశాఖకంటె భిన్నుడేయై ఆకాలమునకు బూర్వమెయున్న దాను యువమహారాజుగనుండినపు డాంధ్రపథములోని పరిసరగ్రామమును బ్రాహ్మణులకు దానము చేసినట్లుగ ధాన్యకటకములోని తన వ్యాపృతునకు దెలియజేయుట యెట్లు సంభవించును? కనుక 240 దవసంవత్సరమునకు దరువాతివాడని చెప్పవలసియుండును. అదియె నిజమైనయెడల మూడవశతాబ్దాంతమునం దనగా 240 సంవత్సరమునకు దరువాతను 301 వసంవత్సరమునకు బూర్వమునుండవలయును. ఇతని శాసనములను బట్టిచూడగా నితడుకృష్ణానది మొదలుకొని దక్షిణమున గాంచీపురమువఱకును పడమట బల్లారివఱకునుగల గొప్పదేశమున కంతకును బ్రభువుగనుండి యేలినట్లుగానిపించుచున్నది. అట్లయిన యెడల నీతడింత రాజ్యము నెట్లుసంపాదింపగలిగెనని శంక పుట్టకమానదు. ఈతడు తనశాసనములందెచ్చటను తానుగాని తనపూర్వులుగాని యాంధ్రభృత్యులను జయించి సంపాదించినట్లుగ జెప్పుకొని యుండలేదు. అటువంటి శాసనములను గరువముతో బ్రకటించుకొన్నవాడు అంతటి బ్రాహ్మణభక్తిగలవాడు, శాసనములయందు దనయొక్క విజయములను గూర్చి లేశమాత్రమున ముచ్చటింపకుండుటకు గారణమేమి? దేశము నెమ్మదిగ లేకుండిన కాలమునందు క్రతువులు చేయుటకుగాని బ్రాహ్మణులకు గోవుల నగ్రహారముల దానముచేసి యరణ్యదేశముల నివసింప బ్రాహ్మణులను బంపుటకు సాధ్యమగునా? సాధ్యముకాదని స్పష్టముగ జెప్పవచ్చును. తనకు బూర్వము బప్పాయనురాజుధర్మకార్యము లనేకములు చేసెనని శివస్కందవర్మ పేర్కొనియుండెను. వీరలిరువురును బహుకాలము దేశపరిపాలనముచేసి ప్రఖ్యాతిగాంచి యుండవలయునుగదా, ఆంధ్రజాతికంటె భిన్నులై యెక్కడినుండియోవచ్చినవారేయైనయెడల బహుశతాబ్దములనుండి రాజ్యముచేయుచుండిన వంశమును నిర్మూలముచేసి బహుస్వల్పకాలములో దేశమును స్వస్థపఱచి పరిపాలించుటకు సాధ్యమగునా? ఒక వేళ సాధ్యముగునేని ఘోరసంగ్రామమమున నాం
పుట:Andhrula Charitramu Part-1.pdf/254
Appearance