పుట:Andhrula Charitramu Part-1.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ కాలముననే పహ్లవులలో శకనులకో సంబంధించిన క్షాత్రపులు సురాష్ట్రమాళవదేశములను వశముచేసికొని పాలించుచుండిరని మనమిదివఱకే తెలిసికొనియుంటిమి. ఈ కాలముననే యాంధ్రదేశమునుజొచ్చి యవనశక పహ్లవాదులు కల్లోలము బుట్టించిరనియు, ఆంధ్రుల స్వాధీనమందుండిన మహారాష్ట్ర దేశము సురాష్ట్ర క్షాత్రపులచే జయింపబడి యాక్రమింపబడినదనికూడ దెలిసికొని యుంటిమి. రెండవశతాబ్దప్రారంభము నందనగా 130 దవ సంవత్సరప్రాంతమున గోతమీపుత్రశాతకర్ణుడను నాంధ్రరాజు యవనశకపహ్లవాదులనోడించి సురాష్ట్ర క్షాత్రపుడగు క్షహరాటవహపానువంశమును నిర్మూలము చేసి తనపూర్వులు గోల్పోయిన రాజ్యమును మరల సంపాందించుటయెగాక శాత్రవభూములనుగూడ నాక్రమించెనని కూడ దెలిసికొని యుంటిమి. అంతకు బూర్వమాంద్రదేశమునకు వచ్చియుండిన యవనశక పహ్లవాదులు శివస్వాతికర్ణుడు గోతమిపుత్రశాతకర్ణుడు మొదలగు నాంధ్రరాజులయొక్క పరాక్రమమునకు నిలువంజాలక వశులైరనియు అదివఱకె విశేషముగా మార్పుజెందియుండిన యవనశకపహ్లవాదులు దేశమున స్థిరనివాసము లేర్పఱచుకొని దేశాచారమతాచారము లవలంబించి దేశీయులతో సంబంధబాంధవ్యముల నెఱపుచు గ్రమముగా దేశీయులలో గలిసిపోయి పల్లవులను తెగగా నేర్పడిరనియు వీరు మొదట నివసించిన ప్రదేశము పల్లవవాడయినదనియు అదియె యిప్పుడు పల్నాడను పేరబిలువంబడుచున్నదనియునుగూడ దెలిసికొనియుంటిమి. పహ్లవులు హిందూమతముల నవలంబించి హిందూనామములనలంకరించుకొనుచుండి రనుటకుగూడ శాసనములనుండి ప్రమాణవాక్యముల నెత్తిచూపవచ్చును. క్రీస్తుశకము 140 దవ సంవత్సర ప్రాంతమున మాళవదేశమును బరిపాలించుచుండి మహాక్షాత్రాపుడగు రుద్రదాముడు వ్రాయించిన జనగడ శాసనమునందు వాని మంత్రి సువిశాఖుడనువాడు పహ్లవుడుగా బేర్కొనబడియున్నాడు. [1] ఈ సువిశాఖుడు కేవలము మంత్రిమాత్రమెకాడు. రెండుపరగణాలకు బరిపాలకుడుగ నున్నవాడు. రుద్రదాముడు యజ్ఞ శ్రీశాతకర్ణినో

  1. Ep. Ind, Vol. VIII, p.49.