నుపనదులువచ్చి గోదావరిలో గలియుచున్నను, ఆగోదావరిలోని జలము గూర్చి ప్రసంగింపవలసి వచ్చినప్పుడు వరదానది జలముకాని,మంజీరానది జలమనికాని, ప్రాణహితానది జలమనికాని పిలువక గోదావరీజలమనే పిలుచుచున్నారము. అట్లు, ఏదేశస్థులయినను, ఏజాతివారయినను, ఆంధ్రదేశముకు వచ్చి, ఆంధ్రదేశమతాచారముల నవలంబించి, ఆంధ్రుల వేషభాషల నలవరించుకొని, ఆంధ్రులతో సంబంధ బాంధవ్యముల నెరపుచు, ఆంధ్రమహాసంఘములో గలిసిపోయిన ఆంధ్రులుగానే పరిగణింపబడుదగిన వారు గాని అన్యులుగా బరిగణింప బడదగిన వారు కారు. ఆంధ్రులలో కలిసిపోయిన పల్లవులయొక్క పూర్వులైన పహ్లవులయొక్క జన్మస్థానం పారశీకమై నంతమాత్రము చేత పల్లవులను పారశీకులునుగా భావించి విదేశీయులగా బరిగణించుట యొప్పిదమైన విషయము గాదు. కావుననే యాంధ్రులలో ఒక తెగగా నేర్పడిన పల్లవుల నాంధ్రులనియే భావించి చదువరులకు సులభముగా బోధపడులాగున నాంధ్రపల్లవులని పేర్కొనుచున్నారము. పహ్లవులే పల్లవులయి రనియు, ఆంధ్రదేశమున పల్లవులకు జన్మస్థానము పల్లవనాడనియు (పల్నాడు) ఏడవప్రకరణమున గొంచముగ సూచించియుంటిమి. పహ్లవులెవ్వరు? ఎక్కడి నుండి వచ్చిన వారు?వీరి చరిత్ర ఏమి? మన పూర్వగ్రంధములం దెచ్చటనైన వీరిని గూర్చి తెలుపంబడియెనా? అనుప్రశ్నంబులను మనము విచారింప వలయును.
పురాణములలోని పహ్లవులు.
మనపురాణాది పూర్వగ్రంధములలో బహ్లవులు పశ్చిమోత్తర జాతులలోని వారనియు, వారిదేశము సింధునదిని పారసీకమునకు నడుమనెచ్చటనో యున్నదని పురాణములలో బోర్కొనంబడియుండెను. మనుధర్మ శాస్త్రకారుడు పల్లవులను మ్లేచ్చులుగా జెప్పియున్నాడు. [1]పహ్లవులు మ్లేచ్చులని మహాభారతములోని భీష్మపర్వములో ఐదవ యధ్యాయమున జెప్పంబడి
- ↑ మనుధర్మశాస్త్రము, అధ్యాయము. 10 శ్లో. 44