Jump to content

పుట:Andhrula Charitramu Part-1.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునందు గన్పెట్టబడెనని యిదివఱకె తెలుపబడియెను. శాతకర్ణియను పేరు నాంధ్రభృత్యవంశపురాజులు ధరించుచుండుటచేత నితడుకూడ నావంశములోని వాడే యనినిశ్చయింపదగును. ఇతని కొమార్తె యొక నాగప్రతిమను, ఒక చెఱువును, ఒక బౌద్ధవిహారమును దానముచేసెనని తెలిపెడి దానశాసనమొకటి వనవాసియందు బర్గెస్సు గారివలన గనిపెట్టబడెనది. ఇచడచ్చోటబరిపాలనము చేయుచుండెనని యందు దెలుపంబడియనని యిదివఱకు పేర్కొనంబడియెను. ఈ క్రొత్తశాసనములో నితడొక బ్రాహ్మణునకు గొన్ని గ్రామముల దానము చేసినట్లు చెప్పబడియెను. అందితడు మట్టి పట్టి యనుదేవుని గూర్చిన ప్రార్థనముగూడ వ్రాయించెను. ఇయ్యదిశివుని పేరులలో నొకటి గా గన్పట్టుచున్నది. ఈ శాసనము నాసిక, ధాన్యకటకము మొదలగు స్థలములలోని యాంధ్రశాసనములం బోలియుండుటయె గాక వానివలె ప్రాకృత భాష లోనున్నది.[1] ఇంతియె గాక మఱియొక విశేషముగలదు.

స్థానకుందూరునకు సమీపముననున్న యొక పురాతనశైవదేవాలయము చెంగట నొక కోనేరును నిర్మించుటనుగూర్చి ప్రాశస్తి యనుదానిలో కుబ్జుడను శైవకవియొకడు వర్ణించియున్నాడు. ఆ శివాలయమునకు దానధర్మములు చేసిన వారిలో శాతకర్ణి యొకడని యాకవి పేర్కొనియున్నాడు. ఆతడు హారితపుత్త్ర శాతకర్ణియని పైజెప్పిన యంశములను బట్టి స్పష్టపడక మానదు. ఈహేతువులన్నిటిని బరిశీలించి చూచినప్పుడు శాతకర్ణాభిధానులయిన యాంధ్రరాజులు మొదట ద్రావిడులనుండి యాభాగమునుగైకొని పరిపాలించిరనియు వారిమూలముననే యాభాగమునకు గర్ణాటమను నామము గలిగిననియు జెప్పెడి వారి వాదమునకు బైనుదహరించిన యంశములు బలకరములుగా నున్నవనుటకు సందియములేదు.

- - - <> - - -

  1. The Indian Antiquary Vol. XXV. p.27,